BigTV English

Empuraan sequel : ‘లూసిఫర్’ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా… టైటిల్ ఏంటంటే ?

Empuraan sequel : ‘లూసిఫర్’ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా… టైటిల్ ఏంటంటే ?

Empuraan sequel : మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan) మూవీ ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చూడడానికి చాలాకాలంగా అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. అయితే మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్ కి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. నిర్మాతలు అధికారికంగా ‘ఎంపురాన్’కి మరో సీక్వెల్ కూడా రాబోతుంది అన్న విషయాన్ని క్లైమాక్స్ లో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి ఇంతకీ నెక్స్ట్ పార్ట్ టైటిల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


‘L3 : ఎంపురాన్’ స్టోరీ ఇదే…

‘ఎంపురాన్’ యూనివర్స్ లో మూడవ పార్ట్ కి ‘L3 : ది బిగినింగ్’ (L3: The Beginning) అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. ‘L2’ థియేటర్లలో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ‘L3 : ది బిగినింగ్’ ప్రేక్షకులను అధికారం, మోసం, నేరాల ప్రపంచంలోకి మరింత లోతుగా తీసుకెళ్లబోతోంది. ఖురేషీ అబ్రహం అని పిలవబడే స్టీఫెన్ నెడుంపల్లి కథ మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. షెన్ డ్రాగన్ అనే చైనీస్ విలన్ ముఠాలోని పవర్ ఫుల్ విలన్ ను పార్ట్ 3 లో పరిచయం చేయబోతున్నారు. దీంతో ‘లూసిఫర్’ యూనివర్స్ కు అంతర్జాతీయ కోణం యాడ్ కాబోతోంది. అలాగే మరోవైపు స్టీఫెన్ ఖురేషి అబ్రహంగా ఎలా మారాడు ? అనే  ఆసక్తికరమైన అంశాన్ని అదిరిపోయే యాక్షన్ డ్రామాతో తెరపై చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


150 కోట్లు కాదు 180 కోట్లు 

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచే ‘L2: ఎంపురాన్’ను స్టార్ట్ చేశారు. కేరళ రాజకీయాల్లో జరుగుతున్న అల్లకల్లోలానికి స్టీఫెన్ ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడు అనేది కథ. ఇక ఈ సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని, పృథ్విరాజ్ సుకుమారన్ మరోసారి గొప్ప నటుడే కాదు… తెలివైన దర్శకుడు అని నిరూపించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు మోహన్ లాల్ అభిమానులు. కానీ విమర్శకుల నుంచి ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మూవీ ప్రమోషన్లలో 150 కోట్ల బడ్జెట్ తో ‘L2: ఎంపురాన్’ రూపొందింది అనే వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పడేశారు. కానీ నిర్మాత గోకులం గోపాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు 180 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. దానికి తగ్గట్టే ఉన్నాయి నిర్మాణ విలువలు కూడా.

‘L2: ఎంపురాన్’ చిత్రంలో మోహన్ లాల్ స్టీఫెన్ నెడుంపల్లి (ఖురేషి అబ్రహం) పాత్రను పోషించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ జాయెద్ మసూద్ పాత్రలో కనిపించారు. అభిమన్యు సింగ్ బాల్ రాజ్ పాత్రలో, టోవినో థామస్ జతిన్ రామ్ దాస్ పాత్రలో తిరిగి వచ్చారు. ప్రియదర్శిని రామ్‌దాస్ పాత్రలో మంజు వారియర్, మిచెల్ మెనుహిన్ గా ఆండ్రియా తివాడర్ నటించారు. ఈ చిత్రంలో జెరోమ్ ఫ్లిన్ బోరిస్ ను ఆలివర్‌గా పరిచయం చేయగా, ఇంద్రజిత్ సుకుమారన్ గోవర్ధన్‌గా నటించారు. జాయెద్ చిన్నప్పటి వ్యక్తిగా కార్తికేయ దేవ్ నటించగా, కార్తీక్‌గా కిషోర్ కనిపించాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×