Ravi – Sudheer : ఇటీవల ఓ బుల్లితెర షోకు సంబంధించి సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), యాంకర్ రవి (Anchor Ravi) కలిసి చేసిన స్కిట్ తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోంది. రంభ (Rambha) రీఎంట్రీ సందర్భంగా ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని స్పూఫ్ చేసి, హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఓ హిందూ సంఘానికి సంబంధించిన అధినేత యాంకర్ రవికి లీగల్ చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో లీక్ అయ్యింది.
యాంకర్ రవి ఆడియో లీక్
తాజాగా లీక్ అయిన ఆడియోలో రాష్ట్రీయ వానరసేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవరెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవితో మాట్లాడారు. “ఒక హిందువు అయ్యి ఉండి, హిందూ సంఘాలను కించపరిచేలా ఇలాంటి స్కిట్స్ చేయడం ఏంటి ? నందీశ్వరుడి కొమ్ముల నుంచి చూస్తే పరమశివుడు కనిపించాలి గానీ… అమ్మాయి కనిపిస్తోందని ఎలా అంటారు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
దానికి రవి “అది చిరంజీవి గారి సినిమా సన్నివేశం” అని సమాధానం చెప్పాడు. “వాళ్ళు తప్పు చేస్తే మీరు కూడా చేస్తారా?” అని సదరు వ్యక్తి నిలదీశారు. దీంతో రవి “అప్పుడే మీరు చిరంజీవి గారికి ఇది తప్పు అని చెప్పి ఉంటే మాకు తెలిసేది. చిరంజీవి గారే చేశారు కదా అని మేము కూడా అలాగే చేశాము. ఆయన అభిమానులము కాబట్టి, ఆయన ఎలా చేస్తే అలా చేస్తాము. అయినా అందులో తప్పేముంది? అమ్మాయిలు కూడా గుడికి వెళ్తారు. సుధీర్ కూడా దేవుడిని చూడాలనుకుంటాడు. కానీ మధ్యలో అమ్మాయి వచ్చింది కాబట్టి ఆమె కనిపించింది. ఇందులో ఎవరిని కించపరిచినట్టుగా ఉంది? ఆ సీన్ చేసేటప్పుడు షూ విప్పేసి నటించాము. మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ది స్టూడియోకి వెళ్లి అడగండి” అంటూ సమాధానం చెప్పాడు.
Read Also : దేవుళ్ళ ఫై చిల్లర స్కిట్స్.. కొంచెం కూడా సిగ్గులేదా..?
తగ్గేదే లే… సారీ చెప్పనంటున్న రవి
కేశవరెడ్డి “మీరు హిందువు కాదా? ఇలా చేస్తారు?” అని ప్రశ్నించగా, “నేను ఇండియన్” అని సమాధానం చెప్పాడు రవి. “ఇతర మతస్తుల మీద ఇలా చేసే దమ్ముందా మీకు? హిందువులు కాబట్టి ఎవ్వరూ ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఇలా చేశారు. మిమ్మల్ని ఈ స్థాయికి ఎవరైతే తెచ్చారో అదే హిందూ సమాజానికి ఈ విషయంలో మీరు క్షమాపణలు చెప్పమని అంటున్నారు అంతే కదా?” అని తిరిగి ప్రశ్నించారు ఆ హిందూ సంఘం వ్యక్తి.
దానికి రవి స్పందిస్తూ “జరిగిన దానికి నా సమాధానం ఏంటంటే నేను హిందువుని, ఇండియన్ ని. ఈ స్కిట్ లో మేము ఎవరిని కించపరచలేదు అని ధైర్యంగా చెప్తున్నాను” అని సమాధానం చెప్పాడు. “మీకు కొంచెం కూడా తప్పు చేసామని పశ్చాతాపం లేదు. అయితే ఇప్పుడు క్షమాపణలు చెప్పనంటారా?” అని ప్రశ్నించగా… “అలాంటివి చెప్పడానికి మాకు పర్మిషన్ లేదు. వాళ్ళు రాసిచ్చిన స్కిట్ ను మేము చేశాము. మీరేదైనా మాట్లాడాలనుకుంటే ఛానల్ కి వెళ్లి మాట్లాడండి” అన్నాడు. చివరకి తను సారీ చెప్పేది లేదని తేల్చి చెప్పాడు. ఇక పనిలో పనిగా ఈ వివాదం కారణంగా ఆ స్కిట్ ని ఇప్పటికే డిలీట్ చేసామని క్లారిటీ ఇచ్చారు రవి. దీంతో చివరికి హిందూ ఆర్గనైజేషన్ వ్యక్తి సీరియస్ అవుతూ “ఈ విషయంపై ఏం చేయాలో అది చేస్తాము. లీగల్ చర్యలకు సిద్ధంగా ఉండండి” అంటూ వార్నింగ్ ఇవ్వడం వినిపిస్తోంది ఆ లీకైన ఆడియోలో.
This is the disease our TV actors and anchors are stuck in.
This is what happens when the industry is infiltrated by Jihadis and #ConversionMafia
When VanaraSena called anchor Ravi and asked to apologise for their shameful act, he said “I’m an Indian. I pray to Ola, I pray to… pic.twitter.com/2ypWnK4mnd
— Tathvam-asi (@ssaratht) April 11, 2025