SriNidhi Shetty: శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.’ కేజిఎఫ్ 1,2′ చిత్రాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నాని (Nani) నటించిన సూపర్ హిట్ మూవీ ‘హిట్ 3’ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీనిధి శెట్టి అందులో భాగంగానే పదవ తరగతి చదువుతున్నప్పుడే తన తల్లిని కోల్పోయిన విషాద గాధను అభిమానులతో పంచుకుంది.
మిస్ సూపర్ నేషనల్ కిరీటాన్ని అందుకున్న శ్రీనిధి శెట్టి..
2016లో మిస్ సూపర్ నేషనల్ కిరీటాన్ని అందుకున్న శ్రీనిధి శెట్టి.. మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అయితే ఈమెకు పేరు తీసుకొచ్చింది మాత్రం ‘కేజిఎఫ్’ సినిమా అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో కన్నడ హీరో యష్ (Yash) హీరోగా నటించిన ‘కేజిఎఫ్ 1& 2’ సినిమాలలో రీనా దేశాయ్ పాత్రలో నటించిన ఈమె.. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో పేరు సొంతం చేసుకుంది ఈ మంగళూరు బ్యూటీ. ఇక తర్వాత తమిళంలో విక్రం(Vikram)తో కలిసి ‘కోబ్రా’ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు నాని ‘హిట్ 3’లో నటించి మరో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈమెకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో..” ఎప్పుడు మీ తండ్రి గురించే ఎక్కువగా చెబుతారు. ఇన్స్టా లో కూడా మీ తండ్రితో ఉన్న ఫోటోలు ఎక్కువగా ఉంటాయి. మీ తల్లి గురించి ఎందుకు తక్కువగా మాట్లాడుతారు? అనే ప్రశ్న ఎదురవగా.. దానికి భావోద్వేగమైన సమాధానాన్ని తెలియజేసింది శ్రీనిధి శెట్టి.
14 ఏళ్లకే తల్లిని కోల్పోయా – శ్రీనిధి శెట్టి
“పదవ తరగతిలో ఉన్నప్పుడే నా తల్లిని కోల్పోయాను. ఆ సమయంలో దేవుడిపై నమ్మకం పోయింది. అందరి నుంచి దూరంగా ఉండాలనిపించింది. ముఖ్యంగా అమ్మ లేకపోయేసరికి నా జీవితం ఇక్కడితో ఆగిపోయిందనుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా ఉండాలనిపించలేదు. దాంతో బెంగళూరుకి వెళ్ళిపోయాను. కొత్త వాతావరణంలో గతాన్ని మర్చిపోవాలని ఎంతో ప్రయత్నం చేశాను. ఇక ఈ సంఘటన నుండి బయటపడడానికి చాలా సమయం పట్టింది. ఎంతో కష్టాన్ని అనుభవించాను. ఇక బెంగళూరు వచ్చాక జీవితం మారిపోయింది. జైన్ కాలేజీలో ఇంజనీరింగ్, ఆ తర్వాత మోడల్, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అంతా ఒక కలలా అనిపిస్తోంది” అంటూ తెలిపింది శ్రీనిధి శెట్టి. ఇంకా చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో తాను పడ్డ వేదనను తలుచుకొని అభిమానులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. అందుకే తన తండ్రికి ఎక్కువగా దగ్గరయ్యానని, తన తండ్రితో ఉండే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తున్నాను అంటూ కూడా తెలిపింది శ్రీనిధి శెట్టి. ఇక ప్రస్తుతం శ్రీనిధి శెట్టి షేర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు కూడా ఇంత కష్టం అనుభవించారా ? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె మరో రెండు సినిమాలలో చేస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ:Nayanthara: ఫ్యామిలీ ట్రిప్ లో నయనతార.. ఈమె వాడే బ్యాగ్ ధర తెలిస్తే షాక్..!