E-Paper
Advertisement

Peddi -The Paradise: అభిమానులకు బిగ్ షాక్.. వాయిదా పడనున్న ప్యారడైజ్..పెద్ది..

Peddi -The Paradise: అభిమానులకు బిగ్ షాక్.. వాయిదా పడనున్న ప్యారడైజ్..పెద్ది..
Advertisement

Peddi -The Paradise: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. 2026 మార్చ్ లో రామ్ చరణ్(Ramcharan) హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా(Peddi Movie) విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా మార్చ్ 27 తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల చిత్ర దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు పోటీగా నాచురల్ స్టార్ నాని(Nani), శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)కాంబినేషన్లో రాబోతున్న ది పారడైజ్(The Paradise) సినిమా కూడా విడుదల కానున్నట్లు తెలిపారు.

వాయిదాపడుతున్న చరణ్, నాని సినిమాలు?

నాని ది పారడైజ్ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదల కాగ, పెద్ది సినిమాని 27వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ సినిమాల విడుదల విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర బృందం ప్రకటించిన ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు విడుదల వాయిదా పడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

గ్లోబల్ రేంజ్ లో ది పారడైజ్..

Advertisement

నాని శ్రీకాంత్ కాంబినేషన్లో రాబోతున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ పనులు పూర్తికాని నేపథ్యంలో మరికాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. ఇలా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావడానికి సమయం పడుతుంది అలాగే ఈ సినిమాని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లకు కూడా కాస్త సమయం కేటాయించాలని భావించారట అందుకే ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాంచరణ్ సినిమా కూడా వాయిదా పడినట్లేనని సమాచారం.

ఏప్రిల్ లో రాబోతున్న పెద్ది?

Advertisement

రామ్ చరణ్ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించి భారీ కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే మరి కాస్త ఆలస్యంగా ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం పెద్ది సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ అభిమానులు మాత్రం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం. ఈ ఇద్దరు హీరోలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల పెద్ది సినిమా నుంచి విడుదల చేసిన చికిరి చికిరి పాటకు భారీ స్థాయిలో ఆదరణ లభించడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి.

Also Read: I Bomma Ravi: కోర్టుకు రాను… ఐబొమ్మ రవి తండ్రి సంచలన నిర్ణయం

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×