BigTV English

VT 13 : మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో మాజీ మిస్ యూనివ‌ర్స్ రొమాన్స్‌

VT 13 : మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో మాజీ మిస్ యూనివ‌ర్స్ రొమాన్స్‌

VT 13 : మెగా హీరోల్లో నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ ఒక‌డు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాల్లోనే న‌టిస్తూ వ‌స్తున్న ఈ యువ క‌థానాయ‌కుడు ఇప్పుడు ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్నారు. ఈరోజు నుంచే సినిమా షూటింగ్ కూడా షురూ అయ్యింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనెసాన్స్ పిక్చర్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో సినిమా రూపొందుతోంది. VT 13 వ‌ర్కింగ్ టైటిల్‌. ఇందులో వ‌రుణ్ తేజ్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ పైలైట్‌గా క‌నిపించ‌బోతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.


2017లో మిస్ యూనివ‌ర్స్‌గా ఎన్నికైన మానుషి చిల్ల‌ర్ VT 13లో హీరోయిన్‌. ఆమె ఈ చిత్రంలో రాడ‌ర్ ఆఫీస‌ర్‌గా అల‌రించ‌నుంది. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్సులో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హ‌డా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మానుషి చిల్ల‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప‌రిమితంగానే సినిమాల్లో న‌టించింది. ఆమె న‌టిస్తోన్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే. ఈ సినిమాలో న‌టించ‌టంపై ఆమె చాలా ఎగ్జ‌యిట్ అవుతున్న‌ట్లు పేర్కొంది.

ఇంత‌కు గ‌ని వంటి బాక్సింగ్ నేప‌థ్య‌మున్న చిత్రంలో న‌టించిన వ‌రుణ్ తేజ్ ఈసారి ఏకంగా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో అయినా మంచి హిట్ సాధించాల‌ని కోరుకుంటున్నారు. VT 13 తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్‌కానుంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×