BigTV English

AP: ఏపీ న్యూస్.. ఆంధ్రాలో అవీఇవీ..

AP: ఏపీ న్యూస్.. ఆంధ్రాలో అవీఇవీ..

AP: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ సీనీయర్ నేతలు పయ్యావుల కేశవ్, అమర్నాథ్‌రెడ్డి సర్‌ప్రైజ్ ఇచ్చారు.. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో ప్రజలతో పాటు లైన్‌లో నిల్చున్నారు.. లోకేష్ దగ్గరికి వెళ్లి తమ ఫోన్ ఇచ్చి సెల్ఫీ కావాలని అడిగారు.


సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది…వారందర్నీ ఎనుములపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో.. సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు.

విశాఖ నగరంలో.. ఓ యువకుడు ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డాడు. స్థానికుల ఫిర్యాదుతో ఓ అపార్ట్ మెంట్‌కు వెళ్లిన కానిస్టేబుళ్లు కిశోర్, కృష్ణారావుపై.. వాచ్ మెన్ దాడికి దిగాడు. పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పరుగులు పెట్టి మరీ రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. వాచ్ మెన్ దాడిలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


చిత్తూరు జిల్లా పలమనేరు-గుడియాత్తం రహదారిపై ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేశాయ్‌. ఏనుగులు రహదారిపై సంచరిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాయ్‌. ఏనుగుల గుంపును చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేసి.. ఏనుగులు వేళ్లే వరకు వేచి ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు… ఘటనాస్థలికి చేరుకొని ఏనుగుల గుంపును అటవీప్రాంతంలోకి తరిమేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం అంకురార్పణతో మొదలై 15 రోజులు పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ తిరువీధుల్లో ఊరేగుతారు. 15 రోజులపాటు జరిగే ఈ సుందర దృశ్యాలను చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కలు తీర్చుకుంటారు.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×