Miss India: భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డ్స్ మిస్ ఇండియా. బ్యూటీ ప్రజెంటేషన్లో ఒకటైన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 విన్నర్ గా నిలిచారు 19 సంవత్సరాల నందిని గుప్తా. 2023లో ఏప్రిల్ లో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ గ్రాండ్ ఫినాలే లో ఆమె ఈ కిరీటాన్నిటిని సొంతం చేసుకున్నారు. నందిని గుప్తా రాజస్థాన్ లో జన్మించారు. చిన్నతనంలోనే యాక్టింగ్ మీద అభిమానంతో టీవీ రంగంలో ప్రవేశించారు నందిని గుప్తా. కొన్ని టీవీ షోలకి హోస్ట్ గా చేశారు. ఈమెకు చిన్నతనం నుండే మిస్ ఇండియా అవ్వాలనే కోరిక ఉండేది. ఆ కోరికను సాధించుకోవడానికి ఆమె అహర్నిశలు కష్టపడి, చివరికి 2023 మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. 2025 మేలో తెలంగాణలో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలో నందిని గుప్తా పాల్గొననున్నారు. అందులో భాగంగా తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకి ఇష్టమైన హీరో గురించి తెలిపారు. ఆ హీరో ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఆయనకు వుండే క్రేజ్ అలాంటిది ..
మిస్ ఇండియా అవ్వాలనే కోరిక మోడలింగ్ రంగంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ, అది కొందరికే దక్కుతుంది. 2022లో మిస్ ఇండియా విజేతగా సినీ శెట్టి నిలిచారు. ఆతరువాత 2023లో నందిని గుప్తా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీకు మహేష్ బాబు అంటే ఎందుకు ఇష్టం అని అడగగా.. నందిని మాట్లాడుతూ.. ‘ఎంతమంది హీరోలు ఉన్నా నాకెందుకో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలను చూస్తూ ఆయన మీద ప్రేమను పెంచుకున్నాను. ఆయన లాంగ్ హెయిర్, చార్మింగ్ ఫేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు ఉండే క్రేజ్ అలాంటిది. ఐ లవ్ మహేష్ బాబు’ అని తెలిపారు. మీరు ఆయనతో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నారా అని అడగ్గా.. ఆమె మాట్లాడుతూ.. ‘డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి డాన్స్ చేయడం ఇంకా ఇష్టం. ఆయన కనిపిస్తే డాన్స్ చేయమని అడుగుతాను’ అని నందిని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా.. తెలుగు అమ్మాయిలకు పోటీగా ఇప్పుడు గుజరాత్ నుంచి మరో అమ్మాయి మహేష్ కోసం వచ్చిందని.. అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా మిస్ వరల్డ్ సూపర్ స్టార్ ని ఇష్టపడుతుంది అంటే,.. ఆయనకు ఆమాత్రం క్రేజ్ వుంటుంది కదా అని నెటిజన్లు అంటున్నారు.
అందాల భామలు ఒకే వేదిక పై..
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 విజేతగా నిలిచిన నందిని గుప్తా తెలంగాణలో జరిగే మిస్ ఇండియా వేడుకకు హాజరుకానున్నారు. నేను నా దేశాన్ని గర్వపడేలా చేయాలని మిస్ వరల్డ్ పోటీలో ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7 నుంచి నెలాఖరు వరకు జరుగుతాయి. 140 పైగా దేశాల నుండి అందాల భామలు హైదరాబాద్ విచ్చేయనున్నారు.
Rashmika Mandanna : కళ్లు ఎర్రబడ్డాయి… పొద్దు పొద్దున్నే ముద్దు పెడుతూ సీక్రెట్ చెప్పిన రష్మిక