YSRCP : వస్తారనుకున్నారు. మొత్తం చెప్పేస్తారనుకున్నారు. కసిరెడ్డి ఖేల్ ఖతం అనుకున్నారు. జగన్‌కూ చిక్కులేనని భావించారు. వేల కోట్ల లిక్కర్ స్కాం గుట్టంతా రట్టు అవుతుందని ఎదురుచూశారు. కానీ, ఇవేవీ జరగలేదు. సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి రాలేదు. అదేం? ఎందుకు రాలేదు? ఆయనేగా సంచలన విషయాలు చెప్పింది? సాయిరెడ్డేగా కసిరెడ్డే కింగ్ పిన్ అని వెల్లడించింది? మీడియాతో చెప్పిన అదే మేటర్.. సీఐడీకి కూడా చెప్పొచ్చుగా? మరి ఎందుకు చెప్పట్లేదు? సిట్ ఎంక్వైరీకి ఎందుకు డుమ్మా కొట్టారు? ఇదే ఇప్పుడు ఏపీలో ఇంట్రెస్టింగ్ డిబేట్.
విజయసాయి డుమ్మా.. ఎందుకు?
విజయసాయిరెడ్డికి అరెస్ట్ భయం కూడా లేదు. ఎందుకంటే ఆయన్ను లిక్కర్ స్కాం కేసులో కేవలం సాక్షిగానే పిలిచారు. తనకు తెలిసున్న సమాచారం చెప్పాలని.. ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగేందుకు మాత్రమే రమ్మన్నారు. మొదట.. ఏప్రిల్ 18న విజయసాయిని సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఆయన ఒకరోజు ముందే ఏప్రిల్ 17ననే వస్తానని కబురు పంపారు. అందుకు సరే అంది సిట్. ఉదయం 10 గంటలకు టైమ్. విజయసాయిరెడ్డి కోసం సిట్ బృందం ఆసక్తిగా ఎదురుచూసింది. ఏమేం ప్రశ్నలు అడగాలో ముందు రెడీ చేసి పెట్టుకుంది. కానీ, తీరా రావాల్సిన సమయంలో.. తాను రాలేనంటూ మెసేజ్ పంపించారు. సిట్ అధికారులు ఉసూరుమన్నారు.
సాయిరెడ్డి సీక్రెట్స్.. ఇంకాఉంది..
గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ దందాపై విజయసాయిరెడ్డినే తనకు తాను కొన్ని విషయాలు బహిర్గతం చేశారు. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ.. అంతా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డినే అంటూ మీడియా సాక్షిగా ప్రకటించారు. అంత ఓపెన్‌గా చెప్పేసరికి సిట్ ఊరుకుంటుందా? సాయిరెడ్డి చాలా సీక్రెట్సే చెబుతారని ఆశ పడింది. విచారణకు రారండంటూ ఆహ్వానించింది. 17న వస్తానన్న ఆయన.. చివర్లో ఏమైందో ఏమో కానీ రాననడం ఆసక్తికరంగా మారింది.
Also Read : కంపెనీని బెదిరిస్తున్న ఎమ్మెల్యే.. కడప ఫ్యాక్షనిజమా?
వైసీపీ పెద్దలకు రిలీఫ్..?
విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదు? ఆయన్ను ఆనాటి పెద్దలు బుజ్జగించారా? బెదిరించారా? కాంప్రమైజ్‌కు డీల్ మాట్లాడారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదంటే, నిజంగానే విజయసాయిరెడ్డికి రావడం కుదరలేదా? మరోసారి వస్తారా? స్కాంలో అసలు సూత్రధారుల పేర్లు చెప్పేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్.