MissTerious : “మిస్టీరియస్” (MissTerious).. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.
“మిస్టీరియస్” సినిమా షూటింగ్ పూర్తి కావటమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిపోయాయి. ప్రస్తుతం ఆడియో లాంఛ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా త్వరలోనే థియోటర్స్ లో సందడి చేయటానికి సిద్ధమైపోతుంది. ఉష శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations) బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ALSO READ : రష్మిక కొత్త ఏడాది కొత్త మూవీకి చిక్కులు… ఆ సీన్స్ డిలీట్ చేయాల్సిందే అంటూ?
మిస్టీరియస్ చిత్రంను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించామని దర్శకుడు మహికోమటిరెడ్డి తెలిపారు. ఇందులో ప్రతీ పాత్ర అనుమానాస్పదంగా ఉంటూ సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వెల్లడించారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే సస్పెన్స్ గా మొదలైన ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నారు. క్రమక్రమంగా క్లూస్ బయటపెడుతూ చివరికి అసలు విషయాన్ని చూపిస్తుందని… ఇందులో షాకింగ్ ట్విస్టులతో పాటు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తప్పించుకునే తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎక్కుతున్న ఈ సినిమా అభిమానులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని.. గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందన్నారు.
ఇక ఈ సినిమాను ఎంతో ఉన్నతమైన విలువలతో తెరకెక్కించడానికి అన్ని విధాలా ప్రయత్నించామని.. ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని నిర్మాత జయ్ వల్లందాస్ తెలిపారు. సినిమా చిత్రీకరణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించామని… సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయని.. అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ సినిమాకి సంగీతం దర్శకుడు M.L రాజా అందించారని.. త్వరలోనే ఆడియో లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని నిర్మాత తెలిపారు. క్లైమాక్స్ వరకు క్షణక్షణం ఉత్కంఠ కలిగిస్తుందని.. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేక ఎక్స్పీరియన్స్ అన్నారు.