Mitra Mandali Teaser..బీవీ వర్క్స్ (BV works), సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి బన్నీ వాసు తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్రమండలి’. ప్రియదర్శి (Priyadarahi) హీరోగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ ఎమ్ (Niharika NM) జోడిగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను విజయేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘మ్యాడ్’ సినిమా నటీనటులు విష్ణు ఓయ్(Vishnu Oi), రాగ్ మయూర్(Rag mayur), ప్రసాద్ బెహర(Prasad behra) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక బన్నీ వాసు సమర్పిస్తుండగా కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మిత్రమండలి టీజర్ ఎలా ఉందంటే?
ప్రియదర్శి అతని టీం క్రికెట్ బ్యాట్, బాల్ లేకుండానే క్రికెట్ ఆడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత క్యారమ్స్ లేకుండానే క్యారమ్ ఆడుతూ సరికొత్తగా కనిపించారు. ఒక అధ్యంతం తమ పర్ఫామెన్స్ తో ఎవరికి వారు ఇరగ కొట్టేసారని చెప్పాలి. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక బాక్సర్ గా నటిస్తున్నట్లు చూపించారు. ఇక సత్య ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెన్నెల కిషోర్ పోలీస్ ఆఫీసర్గా వీరిద్దరూ చేసే సందడి సినిమాకే హైలైట్ గా నిలవనుంది అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇక్కడ సత్య ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని తెలియడంతో ఏంటా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ అభిమానులు కూడా తెగ సర్చ్ చేస్తున్నారు. వీటీవీ గణేష్ ఇందులో పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నారు. అలాగే 90 వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కూడా ఇందులో నటిస్తున్నారు. మొత్తానికైతే అందరూ కూడా ఎవరికి తగ్గట్టుగా వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారని అర్థమవుతుంది.
ALSO READ: Bunny Vasu : బన్నీ వాసు నాయకత్వం వర్ధిల్లాలి.. పేమెంట్ గట్టిగానే అందినట్టు ఉంది!
మిత్రమండలితో సక్సెస్ గ్యారెంటీ..
మొత్తం యువతను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో కచ్చితంగా అటు నిర్మాత బన్నీ వాసు భారీ సక్సెస్ అందుకుంటారని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. తొలిసారి తొలి ప్రయత్నంలో భాగంగా బీవీ వర్క్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మిస్తున్న తొలి చిత్రం మిత్ర మండలి. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ నుండి బయటకు వచ్చి చేస్తున్న తొలి ప్రయత్నం కావడంతో ఈ సినిమా సక్సెస్ కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.