Bunny Vasu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్నేహితుడిగా, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వ్యవహారాలు చూసుకుంటున్న ప్రొడ్యూసర్ బన్నీ వాసు (Bunny Vasu) సడన్గా కొత్తగా బీవీ వర్క్స్ (BV works) పేరుతో ఒక కొత్త బ్యానర్ ను స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యానర్ ద్వారా ‘మిత్రమండలి’ అనే సినిమాను నిర్మిస్తున్నారు . నిర్మాత బన్నీ వాసు ఈ బీవీ వర్క్స్ బ్యానర్ తో పాటు సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మేరకు జూన్ 6వ తేదీన టైటిల్ తో పాటు నటీనటులను కూడా రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో ప్రముఖ యంగ్ స్టార్ హీరో ప్రియదర్శి (Priyadarshi ), ప్రసాద్ బెహరా(Prasad behra) , రాగ్ మయూర్ (Rag Mayur), విష్ణు (Vishnu OI) తోపాటు ఫేమస్ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ ఎమ్ (Niharika NM) తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
బన్నీ వాసు న్యాయకత్వం వర్ధిల్లాలి..
ఇదిలా ఉండగా ఫన్, మిస్టరీ జానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో నిర్మాత బన్నీ వాసు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే మరో అంశం ఏమిటంటే బన్నీ వాసు మాట్లాడుతుండగానే.. పక్కనుంచి ఎవరో “బన్నీ వాసు న్యాయకత్వం వర్ధిల్లాలి” అంటూ కామెంట్ చేశారు. దీనికి అల్లు అరవింద్ (Allu Aravindh) ఇచ్చిన కౌంటర్ మరింత హైలెట్గా నిలిచింది.
also read : Surekha Vani: టాటూ వేయించుకున్న సురేఖా వాణి.. ఎవరా పెదబాబు?
పేమెంట్ గట్టిగానే ముట్టజెప్పారే..
అసలు విషయంలోకి వెళ్తే.. నిర్మాత బన్నీ వాసూ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో అందరినీ కూడా యువతనే ఎక్కువగా తీసుకున్నాము. అయితే ఇలా ఈ సినిమాలో కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ‘జాతి రత్నాలు’ సినిమా. చాలా స్టేజ్ లపై కూడా ఈ విషయాన్ని నేను చెప్పాను. నలుగురు ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే డైరెక్టర్ విజయ్ తో పాటు ఆయన చుట్టూ ఉండే నటీనటులు కూడా మాక్సిమం 30 ఏళ్లలోపు ఉన్నవారినేతీసుకున్నాము. ఇలాంటి యంగ్ స్టార్స్ తోనే ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వీరంతా కలిసి సినిమా చేస్తుంటే మేమంతా సపోర్ట్ ఇచ్చాము. ప్యూర్ గా ఒక యంగ్ బ్యాచ్ ఒక సినిమా తయారు చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా అంటూ బన్నీ వాసు చెబుతూ ఉండగానే పక్కనుండి ఒక వ్యక్తి “బన్నీ వాసు నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ గట్టిగా అరవగా పక్కనున్న వారంతా కూడా నవ్వేశారు.
ఇంకా వెంటనే బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇది పాలకొల్లు కాదు.. AAA అంటూ చెబుతుండగానే అల్లు అరవింద్ మాట్లాడుతూ ..”వాడికి గట్టిగానే పేమెంట్ ఇచ్చినట్టున్నావే” అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చాడు. ఇంకా బన్నీ వాసు మాట్లాడుతూ.. అరవింద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పమన్నాను కాకపోతే నన్ను ఇరికించడానికి ఇలా అంటున్నాడు సార్ అంటూ బన్నీ వాసు కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బన్నీ వాసు నాయకత్వం వర్ధిల్లాలి.. ఇది పాలకొల్లు కాదురా… ఇది AAA#MithraMandali #BunnyVasu pic.twitter.com/aUU8hdeR69
— Telugu360 (@Telugu360) June 12, 2025