Harish Shankar : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాలను తీసి అతి తక్కువ కాలంలోనే మాస్ డైరెక్టర్ అయ్యాడు. అయితే ఇప్పటికే తెలుగు సినీ ప్రియులకు పలు సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన.. ఇప్పుడు అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోతున్నారు.. అయితే ఈ మధ్య హరీష్ శంకర్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఏ సినిమా తీసిన యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గత ఏడాది ఈయన రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ మూవీ చేశాడు ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. తాజాగా డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలను బయట పెట్టాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..
మాస్ చిత్రాలకు కేరాఫ్ హరీష్..
మాస్ యాక్షన్ సినిమాలను తెరకేక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉండగా.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో డైరెక్టర్ ఆయనతోనే హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ప్రస్తుతం ఆ సినిమా స్టోరీ ఫ్యాచ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే పలు సినిమాల ఈవెంట్స్ లో అప్పుడప్పుడు కనిపించే హరీష్ శంకర్.. సినిమాల కోసం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతుంటారు.. అందుకే ఏ ఈవెంట్ కు వెళ్లినా ఆయనే హైలెట్ అవుతాడు. అయితే ఇప్పటివరకు ఆయన తన పర్సనల్ విషయాలను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.
Also Read : ‘పెద్ది’ మూవీలో ఆ పాత్రలో రామ్ చరణ్.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే…
పిల్లలను అందుకే వద్దు అనుకున్నాం..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. తనతోపాటు తాను భార్య స్నిగ్ధ.. పిల్లలు వద్దనుకున్న విషయాన్ని తెలిపారు. దాని వెనుక ఉన్న కారణమేంటో కూడా చెప్పారు. మాది మధ్యతరగతి కుటుంబం. తనపై ఎన్నో బాధ్యతలు ఉండటంతోనే పిల్లల ఆలోచన విరమించుకున్నట్లు బయటపెట్టారు.. తన భార్య ఫుల్ గా సపోర్ట్ చేసిందని గుర్తు చేసుకున్నారు. తన లైఫ్ లో మరే ఇతర బాధ్యతలు వద్దనుకున్నానని ఆయన బయటపెట్టారు. ఒకసారి పిల్లలు పుడితే స్వార్థంగా మారిపోతారు. వారి చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. స్వార్ధంగా మారుతారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ. పిల్లలు లేకపోవడం వల్ల నిస్వార్థం ఉన్నారని అన్నారు హరీష్ శంకర్. అందుకే ఆయనను ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. నా రెమ్యూనరేషన్ కూడా భార్యకు తెలియదు. అయిన తనకు ప్రేమ తగ్గలేదు. మొత్తానికి హరీష్ శంకర్ నిర్ణయం అయితే కొందరికి బాగా నచ్చింది.. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తియ్యబోతున్నాడు.