Manchu Manoj – Manchu Mohan Babu : రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకదాని తర్వాత మరొక వివాదం వస్తూనే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు చెలరేగుతున్నాయి. అధికారికంగా ఇవి ఆస్తి తగాదాలు అని చెప్పకపోయినా కూడా దాదాపు అందరికీ ఇవి ఆస్తికి సంబంధించిన తగాదాలు క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే నిన్న ఉదయం మంచు మోహన్ బాబు మంచు మనోజ్ గురించి కొన్ని వార్తల బయటకు వచ్చాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. అయితే కొంతమంది సినిమా ప్రముఖుల ఎంక్వయిరీ వలన ఇది కేవలం ఫ్యామిలీ ఇష్యూస్ మాత్రమే అటువంటిది ఏమీ లేదు అంటూ మోహన్ బాబు పిఆర్ టీం క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. అయితే నిజం ఇప్పటికి దాగదు అని చెప్పినట్లు ఈ విషయం కూడా ఎక్కువ సేపు దాగకుండా బయటికి వచ్చింది.
ముఖ్యంగా బంజారాహిల్స్ లోని హాస్పిటల్ కు మంచు మనోజ్ వెళ్లడంతో ఈ వివాదంతా బయటకు వచ్చింది. అయితే తాజాగా మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. గుర్తుతెలియని ఒక పదిమంది వ్యక్తులు వచ్చి తనను అటాక్ చేశారని. వాళ్లను పట్టుకున్న ప్రయత్నం కూడా మనోజ్ చేశాడట కానీ వాళ్ళు దొరకలేదు. అయితే మనోజ్ హాస్పిటల్ వచ్చేసిన తరుణంలో, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ను హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లిపోయినట్లు తెలిపాడు మనోజ్. అయితే కేవలం విజయ రెడ్డి, కిరణ్ అనే ఒక వ్యక్తుల పేర్లను మెన్షన్ చేశాడు మంచు మనోజ్. ఇక మనోజ్ రాసిన ఫిర్యాదు కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ తరుణంలో మంచి మోహన్ బాబు కూడా మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ చేశాడు.
మోహన్ బాబు ఫిర్యాదు
మోహన్ బాబు మంచు, Sy.No.194, మంచు టౌన్, జల్పల్లి, రంగా రెడ్డి జిల్లా, హైదరాబాద్ 500005 నివాసి, మీ తక్షణ దృష్టికి మరియు అవసరమైన చర్య కోసం క్రింది వాస్తవాలను తెలుపుతున్నాను
నేను పైన పేర్కొన్న చిరునామాలో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. 08.12.2024న, నా చిన్న కొడుకు శ్రీ మనోజ్ (నాలుగు నెలల క్రితం యాదృచ్ఛికంగా నా ఇంటిని విడిచిపెట్టి తిరిగి వచ్చాడు) అతని ద్వారా ఉద్యోగంలో చేరిన కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మరుసటి రోజు ఉదయం, నేను నా దైనందిన కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు, నా ఇంటి దగ్గర తెలియని వ్యక్తులను నేను గమనించాను. మాదాపూర్‌లోని నా కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు నా ఉద్యోగి ఒకరు, నా కుమారుడు శ్రీ మనోజ్‌కు సహచరులమని చెప్పుకుంటూ దాదాపు 30 మంది వ్యక్తులు నా నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారని నాకు తెలియజేశారు. వారు నా సిబ్బందిని భయంకరమైన పరిణామాలతో బెదిరించారు.
ఈ వ్యక్తులు, నా కుమారుడు శ్రీ మనోజ్ మరియు శ్రీమతి మోనిక సూచనల మేరకు నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని నా ఉద్యోగులను బెదిరిస్తూనే ఉన్నారు. నా భద్రత, నా విలువైన వస్తువులు మరియు నా ఆస్తి గురించి నేను భయపడుతున్నాను. నా నివాసాన్ని శాశ్వతంగా విడిచిపెట్టమని నన్ను బలవంతం చేస్తూ, నాకు హాని కలిగించే ఉద్దేశంతో మరియు భయాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ఈ వ్యక్తులు నా ఇంటికి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారని నాకు సమాచారం అందింది. ఆ వ్యక్తులందరూ సంఘవిద్రోహులు మరియు నాతో సహా నా ఇంట్లో ఉన్నవారికి భయం మరియు ప్రాణహాని కలిగిస్తున్నారు. అంటూ పలు అంశాలు ఫిర్యాదు లో జోడించారు.
Also Read : Dhanush: హాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీతో ధనుష్ సినిమా.. దిమ్మతిరిగే కాంబినేషన్ రెడీ!