Mohan Babu Case : సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కు మళ్లీ షాక్ ఇచ్చింది హైకోర్టు. ఈరోజు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా, హైకోర్టు కొట్టేసినట్టుగా తెలుస్తోంది.
రీసెంట్ గా జల్పల్లి లోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి దగ్గర చోటు చేసుకున్న తండ్రి, కొడుకుల వివాదం మరో గొడవకు దారి తీసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఆ గొడవలో సహనం కోల్పోయి రిపోర్టర్ పై దాడి చేయడం, అతను తీవ్ర గాయాల పాలవ్వడంతో మోహన్ బాబుపై హత్యాయత్నం అంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుంచి మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తాజాగా దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా మోహన్ బాబు (Mohan Babu) తరపు న్యాయవాది ఆయన ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారనే విషయాన్ని కోర్టు ముందు విన్నవించారు. రీసెంట్ గా తన మనవరాలిని కలవడానికి ఆయన దుబాయ్ కి వెళ్ళారని, ఆ తర్వాత తిరిగి వచ్చి తిరుపతిలోని విద్యా సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారని మోహన్ బాబు న్యాయవాది వెల్లడించారు. అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని ఈ సందర్భంగా మోహన్ బాబు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గుండె, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కానీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాడి ఘటనలో మోహన్ బాబు (Mohan Babu) కు ముందస్తు ఇవ్వకూడదని కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మోహన్ బాబుకు కోర్టు దిగువ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించినట్టు సమాచారం. ఇదివరకే మోహన్ బాబు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో, ఆయన పరారీలో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ మోహన్ బాబు తను ఎక్కడికి పారిపోలేదు అంటూ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇక రీసెంట్ గా మరోసారి ఆయన దుబాయ్ పారిపోయారు అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ ఆయన తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ కి వెళ్లి వచ్చినట్టు తాజాగా ఆయన లాయర్ ద్వారా వెల్లడైంది.
ఇదిలా ఉండగా రీసెంట్ గా మోహన్ బాబు (Mohan Babu) నివాసం వద్ద మోహన్ బాబుకు, ఆయన కొడుకు మనోజ్ కు మధ్య గొడవలు జరిగే సంగతి తెలిసిందే. ఆయన ఇంటి వద్ద లైవ్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మీడియా సంఘాలు మోహన్ బాబు తీరుపై భగ్గుమన్నాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే సదరు జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పుడు కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.