Mohan Lal: సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు లగ్జరీ అపార్ట్మెంట్లను, లగ్జరీ కార్లను కలిగి ఉంటారు. ఇక వారు కొన్న లగ్జరీ ఫ్లాట్స్, లగ్జరీ విల్లాల ధరలతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు.అయితే అలాంటిదే ప్రస్తుతం మోహన్ లాల్(Mohan Lal) కి సంబంధించిన వార్త ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మోహన్ లాల్ ఒక ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశారట.అది కూడా దుబాయ్ లో.. ఇక ఆ ఖరీదైన ఫ్లాటు ధర, దాని ప్రత్యేకతలు.. అక్కడ కొనుగోలు చేయడం వెనుక ఉన్న రహస్యం? ఇలా అన్నీ తెలిస్తే కళ్ళు తేలేయడం పక్కా.. ఇంతకీ దుబాయ్(Dubai) లో మోహన్ లాల్ కొన్న ఆ లగ్జరీ ఫ్లాట్ ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బూర్జ్ ఖలీఫాలో ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న మోహన్ లాల్
దుబాయ్ లో ఉన్న బూర్జ్ ఖలీఫా(Burj Khalifa) లోని 29వ అంతస్థులో దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక విలాసవంతమైన సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశారట.
అపార్ట్మెంట్ ధర, ప్రత్యేకతలు..
ఈ అపార్ట్మెంట్ ప్రత్యేకత విషయానికి వస్తే.. ఈ అపార్ట్మెంట్ నుండీ బయటకు చూస్తే దుబాయ్ ఫౌంటెన్, దుబాయ్ నగరంలోని అద్భుతమైన ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయని తెలుస్తోంది. ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ధర ఏకంగా రూ.3.5 కోట్లు ఉంటుందని సమాచారం.
అపార్ట్మెంట్ కొనడం వెనక రహస్యం..
అయితే ఇంత ఖరీదు పెట్టి.. మోహన్ లాల్ బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనడానికి కారణం ఆయన షూటింగ్ ల కోసం లేదా ఇతర వ్యక్తిగత కారణాల కోసం దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ ఉండడం కోసమే ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ని కొన్నారట. ఇక ఈ అపార్ట్మెంట్ ని తన భార్య సుచిత్ర(Suchitra) పేరు మీద రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే మోహన్ లాల్ కి దుబాయ్ లో కేవలం బూర్జ్ ఖలిఫాలోని ఈ ఖరీదైన అపార్ట్మెంట్ మాత్రమే కాకుండా దుబాయ్ లో అరేబియన్ రాంచెస్ ఏరియాలో ఒక ఖరీదైన విల్లా అలాగే PR హైట్స్ రెసిడెన్స్ లో త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయట.
ఇక మోహన్ లాల్ వృత్తిపరంగా లేదా ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల దుబాయ్ కి తరచూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన సమయంలోనే బూర్జ్ ఖలీఫాలో ఒక అపార్ట్మెంట్ కొనాలనే ఆలోచన వచ్చిందట. అందుకే మోహన్ లాల్ 29వ అంతస్తులో ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ని రూ.3.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
మోహన్ లాల్ సినిమాలు..
ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే..ఆయన రీసెంట్ గానే ఎల్ 2 ఎంపురాన్ (L2 Empuran) మూవీ తో భారీ హిట్ ని అందుకొని తాజాగా తుడరమ్ (Thudarum) అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ సినిమాతో దాదాపు 15 ఏళ్ల తర్వాత సీనియర్ నటి శోభన(Shobana) మోహన్ లాల్ తో జత కట్టింది.పరువు హత్యల నేపథ్యంలో వచ్చిన తుడరమ్ మూవీ కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు టాలీవుడ్ లో మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ:Premi Vishwanath: వామ్మో, వంటలక్క.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా!