BigTV English

Mohanlal: ‘బరోజ్’ మూవీకి ఫ్లాప్ టాక్.. మోహన్‌లాల్ షాకింగ్ రియాక్షన్

Mohanlal: ‘బరోజ్’ మూవీకి ఫ్లాప్ టాక్.. మోహన్‌లాల్ షాకింగ్ రియాక్షన్

Mohanlal: దర్శకుడిగా, హీరోగా అయితే సక్సెస్ అయిన సినీ సెలబ్రిటీలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. తాజాగా మాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా దర్శకత్వంపై ఆశతో ఒక ప్రయోగం చేశారు. అదే ‘బరోజ్’. ఈ చిత్రానికి మొదటిరోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో ఈ విషయంపై మోహన్ లాల్ స్పందించక తప్పలేదు. డైరెక్టర్‌గా ఆయన చేసిన మొదటి ప్రయోగం ఫెయిల్ అవ్వడంపై మోహన్ లాల్ స్పందించారు.


విజువల్ ట్రీట్

‘బరోజ్’ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు మోహన్ లాల్. హీరోగా సూపర్ స్టార్ హోదాను దక్కించుకున్న మోహన్ లాల్.. మొదటిసారి డైరెక్టర్‌గా ప్రయోగం చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా ‘బరోజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కేవలం 3డీలోనే విడుదల చేశారు మోహన్ లాల్. అలా చేయడం మంచి నిర్ణయమే అని ఫీల్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఇది 2డీలో ఎందుకు విడుదల చేయలేదని అడగగా.. ‘బరోజ్’ను విజువల్ ట్రీట్‌గా ఫీల్ అవ్వాలంటే 2డీ అవసరమే లేదని తెలిపారు. అవసరమైతేనే 2డీ ప్రింట్స్ యాడ్ చేస్తానని చెప్పారు. దర్శకుడిగా క్రియేటివిటీ చూపించడానికే ‘బరోజ్’ (Barroz) తెరకెక్కించారని, డబ్బుల కోసం కాదని అన్నారు.


Also Read: టాలీవుడ్ వైపు ఆసక్తి.. ఇక్కడ నచ్చలేదంటూ హాట్ కామెంట్స్..!

వారికి గిఫ్ట్

‘‘ఇది డబ్బుల కోసమో, కలెక్షన్స్ కోసమో కాదు. నేను ఏదైనా చేసి ఆడియన్స్‌కు చూపించాలని అనుకున్నాను. గత 47 ఏళ్లుగా వారు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి వారికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇది. నేను చిన్నపిల్లలతో ఫ్యామిలీస్ కలిసి చూసే సినిమాను తీశాను. ప్రతీ మనిషిలో ఉండే చిన్నపిల్లలను కూడా ఇది మెప్పిస్తుంది’’ అని ‘బరోజ్’ను అసలు ఎందుకు తెరకెక్కించారో బయటపెట్టారు మోహన్ లాల్. కానీ ఆ సినిమాను చూసిన తర్వాత హీరోగా ఎంతో సక్సెస్ అయిన మోహన్ లాల్.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది యావరేజ్ అంటున్నారు. అపలు ఆయన ఇలాంటి ప్రయోగం చేయకుండా ఉండాల్సింది అని సలహా కూడా ఇస్తున్నారు.

కొత్త ఎక్స్‌పీరియన్స్

‘బరోజ్’ సినిమా కోసం అందరూ ఎంత కష్టపడ్డారో మోహన్ లాల్ (Mohanlal) వివరించారు. ‘‘దాదాపు 1650 రోజుల పాటు, ఆరేళ్ల పాటు ఈ సినిమా ప్రొడక్షన్ జరిగింది. చాలామంది ఇందులో భాగమవ్వడం వల్ల ప్రాజెక్ట్ మరింత అద్భుతంగా మారింది. ఎంతోమంది గొప్ప నటీనటులు, టెక్నీషియన్స్ కలవడం వల్ల ఇది కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా మారింది. ఇది కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి మాత్రమే తెరకెక్కింది’’ అని అన్నారు. ‘బరోజ్’ను మోహన్ లాల్ డైరెక్ట్ చేయడంతో పాటు తానే హీరోగా కూడా నటించారు. మొదటిరోజు ఈ మూవీ రూ.3.45 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత నుండి కలెక్షన్స్ చాలా తగ్గిపోయాయి. మొత్తంగా ‘బరోజ్’కు రూ.8.75 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×