Odela 2: మామూలుగా ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఏం జరిగినా కూడా అందులో తమ సినిమా చాలా బాగుంటుందని, మేకర్స్ అంతా కష్టపడ్డారని, నటీనటులు బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవడం అలవాటే. కానీ అదే సినిమా విడుదలయిన తర్వాత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సక్సెస్ మీట్ పెట్టి అవే మాటలను రిపీట్ చేస్తే చూడడానికి చాలా వింతంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ‘ఓదెల 2’ విషయంలో అదే జరుగుతుందేమో అనిపిస్తోంది. ఈ సినిమాలో తమన్నాను శివశక్తి పాత్ర కోసం ఎంచుకోవడంతోనే మేకర్స్ దీనిపై ఒక హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. కానీ విడుదలయిన తర్వాత మాత్రం ఈ మూవీ హైప్‌ను అందుకోలేకపోయింది. అయినా కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సంపత్ నందిని తెగ ప్రశంసించేస్తున్నారు నటీనటులు.
భారీ ప్రమోషన్స్
తమన్నా హీరోయిన్‌గా నటించిన ‘ఓదెల 2’ను సంపత్ నంది డైరెక్ట్ చేయలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ క్రెడిట్ తన ఖాతాలోకి వెళ్తోంది. పైగా ప్రమోషన్స్ విషయంలో కూడా దర్శకుడి కంటే దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సంపత్ నందినే యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఈ మూవీకి తను దర్శకత్వ పర్యవేక్షణతో పాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. అలా ‘ఓదెల 2’ రిలీజ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుండి తమన్నా, సంపత్ నంది దీనిని ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అలా ప్రేక్షకుల్లో కూడా మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడినా.. సినిమా విడుదలయిన తర్వాత మాత్రం ఇది ‘అరుంధతి’లాగానే ఉందంటూ పోల్చడం మొదలుపెట్టారు.
తెగ పొగిడేశాడు
‘ఓదెల 2’ చూస్తుంటే అనుష్క ‘అరుంధతి’కి స్పూఫ్ లాగా ఉందని చాలామంది ప్రేక్షకులు ఓపెన్‌గా రివ్యూలు అందించారు. కానీ మూవీ టీమ్ మాత్రం సినిమా సక్సెస్ అయ్యిందంటూ ఏకంగా సక్సెస్ మీట్‌నే ఏర్పాటు చేశారు. ఆ సక్సెస్ మీట్‌లో ‘ఓదెల 2’లో విలన్‌గా నటించిన వశిష్ట సింహా.. సంపత్ నంది (Sampath Nandi)ని పొగిడేస్తూ కామెంట్స్ చేశాడు. ‘‘ఒక యాక్టర్‌కు ఒక క్లోజప్ పడడమే గొప్ప విషయం. క్లోజప్ కావాలని అందరూ కోరుకుంటారు. ఓదెల 2లో ఉన్న చాలామంది కొత్త యాక్టర్స్‌కు అన్ని క్లోజప్స్, అంత పెద్ద డైలాగులు పెట్టి వాళ్ల కెరీర్‌ను ముందుకు వెళ్లేలా చేస్తున్నారు. కచ్చితంగా ఈ విషయాన్ని ప్రశంసించాలని అనుకున్నాను’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు వశిష్ట సింహా.
Also Read: బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్ అప్డేట్.. ఇప్పుడు షూటింగ్ ఎక్కడంటే.?
లైఫ్ ఇచ్చినట్టు కాదేమో
‘ఓదెల 2’ (Odela 2) సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి సూపర్ హిట్ అయ్యుంటే వశిష్ట సింహా చెప్పినట్టుగానే నిజంగానే యాక్టర్లకు లైఫ్ ఇచ్చినట్టుగా ఉండేదని, కానీ మూవీకి నెగిటివ్ టాక్ వస్తున్నప్పుడు అది లైఫ్ ఇచ్చినట్టుగా కాదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్‌లో ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించింది. కానీ మొదటిసారి అన్నింటికి భిన్నంగా ఒక శివశక్తి పాత్రలో నటిస్తుంది అనగానే ప్రేక్షకులంతా షాకయ్యారు. ఆ పాత్రకు న్యాయం చేయడానికి తను చాలానే ప్రయత్నించిందని ఫ్యాన్స్ అంతా తనకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ చాలావరకు ఇది ‘అరుంధతి’ స్పూఫ్ అనే రివ్యూలే వినిపిస్తున్నాయి.