Thudarum Telugu Trailer: ప్రముఖ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) ప్రస్తుతం ‘L2: ఎంపురాన్’ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే స్పీడుతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘తుడరుమ్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి తరుణ్ మూర్తి (Tarun Murthy) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మోహన్ లాల్ సరసన ప్రముఖ సీనియర్ హీరోయిన్ శోభన (Shobana ) నటిస్తున్నారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్ గా, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ భర్తగా కనిపించనున్నారు. రెజాపుత్ర విజువల్ మీడియా బ్యానర్ పై ఎం.రంజిత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఎలా ఉందంటే..?
1.58 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో మోహన్ లాల్ ఫ్యామిలీ మెన్ గా కనిపించారు. ట్రైలర్ మొదలవగానే ఒక వ్యక్తితో మోహన్ లాల్ మాట్లాడుతూ..’ అప్పట్లో మాకు లెక్కలు చెప్పే మాస్టర్ ఒకరు ఉండేవారు. ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా.. ఆ పీరియడ్ లో ఆయన వచ్చేవారు. తలకిందులు తపస్సు చేసిన ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయే వాళ్ళం. జవాబు దొరకదు.. అవమానిస్తారు.. పంపించేస్తారు”. అంటూ బాధపడుతూ ఉండగా.. పక్కనే ఉన్న వ్యక్తి ఇంతకు నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావ్ అని ప్రశ్నిస్తాడు?? కట్ చేస్తే.. మోహన్ లాల్ కార్ క్లీన్ చేసుకుంటూ కనిపించాడు. అలా చక్కగా టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ అటు కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న మోహన్ లాల్ కారును అనూహ్యంగా పోలీసులు తీసుకెళ్లి పోతారు. ఆ కార్ ను విడిపించుకోవడానికి ఆయన ఎన్నో తంటాలు పడతారు. చివరికి కారు చేతికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెన్ గా ఉన్న మోహన్ లాల్ కాస్త రౌద్రంగా మారిపోతారు. అసలు ఆయన కారును పోలీసులు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? మోహన్ లాల్ ఎందుకలా మారిపోయారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలను సస్పెన్స్ గా పెట్టేశారు. మరి ఇవన్నీ తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
ఏప్రిల్ 25 న విడుదల..
ఇకపోతే ఈ సినిమా విడుదలపై పలు రూమర్లు హల్చల్ చేస్తూ ఉండగా.. మే వరకు విడుదల కాదంటూ సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్లు చేశారు. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.. అందులో భాగంగానే.. మీరు ఎన్నో రోజుల నుండి ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని వింటున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ రూమర్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. మొత్తానికైతే ఈ సినిమాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోహన్ లాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
also read:Badshah : పాకిస్థానీ నటితో బాలీవుడ్ ర్యాపర్ ఎఫైర్… వ్యవహారం మొత్తం బయటపెట్టిన శిల్పా శెట్టి..!