Vishnu Vishal – Jwala Gutta :ప్రముఖ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) ఎట్టకేలకు తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. పండంటి ఆడపిల్ల పుట్టినట్లు తెలిపారు. “మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయిపోయాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు పాప పుట్టడం మాకు మరింత ఆనందంగా ఉంది. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాము. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం మా బిడ్డపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలుపుతూ ఎక్స్ లో ఒక ఫోటో పంచుకున్నారు. దీంతో ఈ జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పెళ్లిరోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జంట..
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా (Jwala Gutta) , నటుడు విష్ణు విశాల్ 2021 ఏప్రిల్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఇదే రోజు పాప పుట్టడం చాలా స్పెషల్ గా ఉంది అంటూ అటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే క్రికెట్లో కొంతకాలం కెరియర్ కొనసాగించిన తర్వాత 2009లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు విష్ణు విశాల్. ‘ఎఫ్ఐఆర్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. గత ఏడాది ‘లాల్ సలాం’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈయన ఇప్పుడు మరో మూడు సినిమాలలో నటిస్తున్నారు.
జ్వాలా గుత్తా కెరియర్..
గుత్తా జ్వాల విషయానికొస్తే.. భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా కూడా నితిన్ (Nithin) హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈమె 2005 లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు అయిన చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకుంది. అయితే పలు కారణాలవల్ల 2011లో ఇతడితో విడాకులు తీసుకుంది. ఇక తర్వాత హైదరాబాద్ మొయినాబాద్ లో విష్ణు విశాల్ ను పెళ్లి చేసుకోగా.. మొదట ఆర్యన్ అనే కుమారుడు జన్మించగా.. ఇప్పుడు కుమార్తె జన్మించింది. ఇకపోతే బ్యాడ్మింటన్గా ఉన్నప్పుడు ఈమెపై ఎన్నో అసభ్యకర వ్యాఖ్యలు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో 2013 ఆగస్టు 25 ఆదివారం వంగా బీట్స్ తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అక్కడి అభిమానులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్రమన స్థానం చెందింది. మ్యాచ్ ముగిశాక అధికారులతో ఆమె వాగ్వాదానికి కూడా దిగింది. ఈ విషయం ఐ.బి.ఎల్ నిర్వహకులకు ఫిర్యాదు చేయదలచుకోలేదని కూడా స్పష్టం చేసింది. ఎవరికివారు సభ్యత నేర్చుకోవాలని కూడా తెలిపింది. ఈ వ్యవస్థలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రేక్షకులు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. మేమంతా క్రీడాకారులం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి అంటూ కూడా ఆమె తెలిపింది. ఇక ఇప్పుడు బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ఈమె వైవాహిక జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తోంది.