APPSC Group-1: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అంతా రెడీ అయ్యింది. 13 సెంటర్లలో ఈ పరీక్ష జరగనుంది. 89 పోస్టులకు దాదాపు 4496 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షల నేపథ్యంలో ఆయా ఎగ్జామ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కాకపోతే అభ్యర్థులు పరీక్షలు రాసేటప్పుడు ఆ తప్పులు చేయకూడదని చెబుతున్నారు.
శనివారం నుంచి గ్రూప్ 1 పరీక్షలు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాల్లో జరుగనున్నాయి. మే 3 నుంచి 9 వరకు వరకు ఆయా పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. మొత్తం ఈ మెయిన్స్ పరీక్షల్లో 7 పేపర్లు ఉంటాయి.
ఈనెల 3న అంటే శనివారం తెలుగు, 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరగనుంది. ఈనెల 5 నుంచి 9వ వరకు మెయిన్స్ జరుగుతాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులను 9.45 గంటల లోపు వచ్చివారిని మాత్రమే అనుమతిస్తారు.
విశాఖపట్నంలో రెండు కేంద్రాల్లో 1190 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. విజయవాడలోని 6 కేంద్రాల్లో 1801 మంది రావచ్చు. తిరుపతిలోని 3 కేంద్రాల్లో 911 మంది, అనంతపురంలోని 2 కేంద్రాల్లో 594 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే అనుమతిస్తారు. అయితే అదనంగా మరో 15 నిమిషాల పాటు అనుమతిస్తారు.
ALSO READ: అమరావతికి రైలు ఆ గ్రామాల మీదుగా
ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నా పత్రాలు
హాల్ టిక్కెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ చూపాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలను ముందుగా పరిశీలించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు సూచన చేశారు. చివరి నిమిషంలో ఆలస్యాన్ని అనుమతించరని, ఈ విషయంలో అభ్యర్థులు ఏ మాత్రం తప్పు చేయవద్దని చెబుతున్నారు.
ఈసారి గ్రూప్-1 మెయిన్స్‌లో ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నా పత్రాలను అభ్యర్థులకు అందిస్తారు అధికారులు. ఆన్సర్ షీట్లపై కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్‌తో సమాధానాలు రాయాలి. జవాబు పత్రాలను డామేజ్ చేసే పెన్నులను అనుమతి లేదు. స్కెచ్ పెన్‌లను వినియోగిస్తే మాల్ ప్రాక్టీస్‌గా పరిగణిస్తామని తెలిపారు. ట్యాబ్ ద్వారా ప్రశ్నాపత్రాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
మే 3న తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్
మే 4న ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్
మే 5న పేపర్ 1- జనరల్ ఎస్సై వర్తమాన అంశాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఉంటాయి.
మే 6న పేపర్ 2- హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ, ఇండియాతోపాటు ఆంధ్రప్రదేశ్
మే 7న పేపర్ 3- పాలిటిక్స్, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్
మే 8న పేపర్ 4-ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్
మే 9న పేపర్ 5-సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్