BigTV English

Mohanlal: మోహన్ లాల్ లవ్ స్టోరీ.. ఇంత విసిగిపోయారా..?

Mohanlal: మోహన్ లాల్ లవ్ స్టోరీ.. ఇంత విసిగిపోయారా..?

Mohanlal.. సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ వివాదాలకు దూరంగా ఉండే మోహన్ లాల్ (Mohan Lal)అంటే అమితమైన మర్యాద. ముఖ్యంగా ప్రేక్షకులకే కాదు సౌత్ ప్రేక్షకులకు కూడా మోహన్ లాల్ అంటే అభిమానమే. ఇకపోతే వృత్తిపరంగా ఎప్పుడూ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతే సంతోషంగా కొనసాగుతున్నారు. ఇకపోతే అందరిలాగే ఈయన కూడా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోహన్ లాల్ భార్య సుచిత్ర (Suchitra)ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి గురించి చెప్పుకొచ్చారు.


లవ్ స్టోరీ రివీల్ చేసిన మోహన్ లాల్ భార్య..

సుచిత్ర.. మోహన్ లాల్ తో మొదలైన తన ప్రేమాయణం మొదలై.. పెళ్లి వరకు ఎలా వెళ్ళింది? అనే విషయంపై మాట్లాడారు. సుచిత్ర మాట్లాడుతూ.. నేను చేతన్ (మోహన్ లాల్)ను తొలిసారి తిరువనంతపురంలో జరిగిన ఒక పెళ్లిలో చూశాను. ఆ రోజు చేతన్ మెరూన్ కలర్ షర్టు వేసుకొని చాలా అందంగా కనిపించారు. అయితే చేతన్ ను అంతకుముందు తెరపై చూడడమే కానీ ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. అయితే అప్పుడే మా రెండు కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది. ఆయన నటించిన మొదటి సినిమా ‘మజిల్ విరింజ పుక్కల్’ అనే సినిమా చూసినప్పుడు నాకు చేతన్ పై ప్రేమ కలగలేదు. కానీ ఆ తర్వాత కాలంలో. తెలిసినవారు కదా అని ఆయన సినిమాలు చూడడం మొదలు పెట్టాను. కాల క్రమేణా ఆయన ఎంత ప్రతిభావంతులో అర్థమైంది. అప్పటి నుంచే చేతన్ ను ఇష్టపడడం ప్రారంభించాను. అయితే నా ప్రేమను అతడికి ఎలా వ్యక్త పరచాలో అర్థం కాలేదు. దాంతో నేను ఎవరో తెలియకుండా ఉత్తరాలు రాయడం ప్రారంభించాన. సుమారుగా రోజుకు ఐదు ఉత్తరాలు పంపే దాన్ని. ముఖ్యంగా ఆయన సినిమా షూటింగ్ ల నిమిత్తం లేదా ఇతర పనుల కారణంగా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని మరీ ఆ అడ్రస్లకు నేను ఉత్తరాలు పంపించేదాన్ని.


నా ప్రేమతో వేధించాను..

ఒక్క మాటలో చెప్పాలి అంటే నా ప్రేమతో చేతన్ ను నేను బాగా వేధించాను. అంతేకాదు చేతన్ ను నేను పేరు పెట్టి పిలవకుండా ‘సుందర కుట్టప్పన్’ (అందమైన అబ్బాయి) అంటూ ఒక కోడ్ భాషలో పిలిచే దాన్ని. ఇకపోతే నేనే ఉత్తరాలు పంపిన విషయం చేతన్ కి తెలియదు. ఒకరోజు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు.. నేను ఈ విషయాన్ని మా అమ్మ నాన్నతో తెలిపాను. వారు కామన్ ఫ్రెండ్ ద్వారా చేతన్ తల్లిదండ్రులతో మాట్లాడి, మా పెళ్లి చేశారు మా పెళ్లి తర్వాతే ఈ ఉత్తరాల విషయం బయటకు వచ్చింది” అంటూ వారి లవ్ స్టోరీని తెలిపింది సుచిత్ర. ఈ విషయం విన్న నెటిజన్స్ మీ ప్రేమ మరో సీతారమం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భారీ పాపులారిటీ..

ఇక వీరిద్దరూ 1988లో వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక మోహన్ లాల్ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మోహన్ లాల్ కి తెలుగులో భారీ పాపులారిటీ లభించిన విషయం అందరికీ తెలిసిందే.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×