BigTV English

Nani : నా కెరియర్ లో మోస్ట్ అండర్టేడ్ సినిమాలు ఇవే

Nani : నా కెరియర్ లో మోస్ట్ అండర్టేడ్ సినిమాలు ఇవే

Nani : కొన్ని సినిమాలు వినడానికి చాలా బాగుంటాయి. ఇంకొన్ని సినిమాలు కు సంబంధించిన కథ పేపర్ మీద చాలా బాగుంటుంది. ఇంకొన్ని సినిమాలు థియేటర్లో చూడడానికి కూడా బాగున్న వాటికి రావాల్సిన గుర్తింపు రాదు. అలాంటి సినిమాలు ప్రతి హీరో కెరియర్ లో ఉంటాయి. ప్రస్తుత కాలంలో కొంతమంది సినిమా ప్రేమికులు మోస్ట్ అండర్టేడ్ అని ఆ సినిమాలను తవ్వితీస్తుంటారు. కొన్ని సినిమాలు ప్రస్తావన వచ్చినప్పుడు అసలు ఈ సినిమాలు ఎందుకు పోయాయి రా బాబోయ్ అనిపిస్తుంది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, నాగచైతన్య నటించిన జోష్, మహేష్ బాబు నటించిన ఖలేజా వంటి ఎన్నో సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు. అలా నాని కెరియర్ లో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలను స్వయంగా నాని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.


నాని మోస్ట్ అండర్టేడ్ ఫిలిమ్స్

నాని నటించిన సినిమాలలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా తెలియని వారు ఉండరు. ముఖ్యంగా సినిమా కొంతమంది ప్రాక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సినిమాలో నాని పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఆ సినిమా అద్భుతంగా ఉన్నా కూడా ఆ సినిమాకి రావలసిన గుర్తింపు రాలేదు అని ఫీల్ అవుతుంటాడు నాని. అలానే హను రాఘవపూడి దర్శకత్వం వహించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ. వాస్తవానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాకి రావాల్సినంత రీచ్ రాలేదు అనేది వాస్తవం. ఈ సినిమా కూడా నాని కెరీర్ కి మంచి ప్లస్ అయింది. నానిని ఈ సినిమాలో సరికొత్తగా చూపించాడు హను.


అంటే సుందరానికి

నాని కెరియర్ లో మోస్ట్ అండర్టేడ్ సినిమా అంటే సుందరానికి. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా రోజుల తర్వాత నాని ఒక కామెడీ ఫిలిం చేస్తున్నాడు అని అందరూ ఊహించి థియేటర్ కు వచ్చారు. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్,టీజర్ కూడా అలానే కట్ చేశారు. కానీ సినిమాకి వెళ్లిన తర్వాత కామెడీ తో పాటు ఒక సీరియస్ సబ్జెక్టును తీసుకున్నారు. ఆ సబ్జెక్ట్ చాలామందికి ఎక్కకపోవడం వలన ఈ సినిమాను ల్యాగ్ అంటూ పక్కన పెట్టేశారు. వాస్తవానికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా మోస్ట్ అండర్టేటెడ్ గా మిగిలిపోయింది. ఈ మూడు సినిమాలు తన కెరీర్లో మోస్ట్ అండర్టేడ్ అని నాని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also Read : Single Movie : శ్రీ విష్ణు సింగిల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, క్రేజీ వీడియోతో కన్ఫర్మేషన్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×