టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తెజేస్విని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఒక మగపిల్లాడు కూడా పుట్టాడు. తేజస్విని వచ్చాక దిల్ రాజు లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడం, స్టైల్ గా రెడీ అవ్వడం దిల్ రాజులో కొత్తగా కనిపిస్తున్న విషయాలు. దిల్ రాజులో మార్పులకి తేజస్వినే కారణం అని తెలుస్తోంది. తేజస్విని జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటాను, ప్రతిరోజుని యోగాతో మొదలుపెడతాను. ఆ తర్వాత వర్క్ లైఫ్ లో బిజీ అవుతాను అని ఇటివలే బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.
ప్రొఫెషనల్ లైఫ్ నుంచి ఫ్రీ అవ్వగానే పర్సనల్ లైఫ్ లోకి తేజస్విని షిఫ్ట్ అవుతుందట. ఫ్రీ టైమ్ దొరికితే బాబుతో, దిల్ రాజుతో టైమ్ స్పెండ్ చేస్తాను అని తేజస్విని చెప్పుకొచ్చింది. ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకునే తేజస్విని, ఫ్రూట్స్ ఎక్కువగా తింటాను అంటూ తన బ్యూటీ సీక్రెట్ ని చెప్పింది తేజస్విని. మగవాళ్లకి హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ని మైంటైన్ చేస్తూ ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలని తేజస్విని సలహాలు ఇచ్చింది.
ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే, 2025 సంక్రాంతికి… సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలిడ్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నాడు. ఊహించని హిట్ కొట్టిన ఈ మూవీతో దిల్ రాజు గేమ్ చేంజర్ నష్టాలని తగ్గించుకున్నాడు. రాబోయే రోజుల్లో దిల్ రాజు నుంచి భారి బడ్జట్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. బలగం వేణు దర్శకత్వంలో “ఎల్లమ్మ” సినిమాని నితిన్ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ మూవీతో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న “తమ్ముడు” సినిమా పనులు కూడా దిల్ రాజు కాంపౌండ్ లో వేగంగా జరుగుతున్నాయి.
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి దిల్ రాజు చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కి ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయితే దిల్ రాజు అనుకుంటున్న ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే దిల్ రాజు బ్యానర్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్లే.