Pakistan – IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )… అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మరో ఐదు రోజుల్లోనే ఈ టోర్నమెంట్ ఆరంభం అవుతుంది. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. దాదాపు 75 రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్.. కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఇప్పటికే 10 జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. తమ హోమ్ గ్రౌండ్ లో గంటల తరబడి ప్లేయర్లందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు.
Also Read: IPL 2025: నాలుగు రోజుల్లోనే ఐపీఎల్ 2025.. టైమింగ్స్, ఉచితంగా చూడాలంటే ఎలా ?
ఇటీవల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలంలో చాలామంది ప్లేయర్లు భారీ ధర పలికారు. ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ పైన అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇది ఇలా ఉండగా…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో పాకిస్తాన్ ప్లేయర్లు ఎవరు ఆడడం లేదన్న సంగతి తెలిసిందే. వాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి బ్యాన్ విధించింది. 2008 సంవత్సరంలో జరిగిన ముంబై ఉగ్రవాదుల అరాచకాల నేపథ్యంలో… పాకిస్తాన్ ప్లేయర్లను ( Pakistani players ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తొలగించారు.
అప్పటినుంచి ఇప్పటివరకు ఆ బ్యాన్ కొనసాగుతోంది. అయితే పాకిస్తాన్ ప్లేయర్ల పైన బ్యాన్ ఉన్నప్పటికీ కొంతమంది ప్లేయర్లు మాత్రం… ఐపీఎల్ ఆడుతున్నారు. పాకిస్తాన్ లో ( Pakisthan ) పుట్టి ఆ తర్వాత… విదేశాల్లో స్థిరపడ్డ వాళ్లు మాత్రం ఐపీఎల్ ఆడుతున్నారు. వాళ్లకు పాకిస్తాన్ పౌరసత్వం కాకుండా వేరే దేశాల పౌరసత్వం ఉంది కాబట్టి.. భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) పర్మిషన్స్ ఇచ్చింది.
Also Read: IPL 2025: హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే ?
అయితే… పాక్ లో పుట్టి.. విదేశాలకు వెళ్లి స్థిరపడ్డ ప్లేయర్లలో… ఇమ్రాన్ తాహిర్ ఉన్నాడు. లాహోర్ లో పుట్టిన ఇమ్రాన్ తాహిర్… 2011 ప్రపంచకప్ తర్వాత… సౌతాఫ్రికా పౌరసత్వం తీసుకున్నాడు. ఈ తరుణంలో నే 2014 సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అవకాశం దక్కించుకున్నాడు ఇమ్రాన్ తాహీర్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ఆడాడు. సికిందర్ రాజా… ఇతను కూడా పాకిస్తాన్ లోనే పుట్టాడు. కానీ జింబాబ్వే వారసత్వాన్ని దక్కించుకున్నాడు సికిందర్ రాజా.
ఈ నేపథ్యంలోనే 2023 సంవత్సరంలో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపిఎల్ లో బరిలోకి దిగాడు. పాకిస్తాన్ లోని సియాల్ కోటలో రాజా జన్మించినట్లు చెబుతున్నారు. కానీ బతుకుదెరువు కోసం పాకిస్తాన్ వదిలి జింబాబ్వే వెళ్లారట. ఉస్మాన్ కవాజా…. కూడా పాకిస్తాన్ వాడే. ఇస్లామాబాదులో జన్మించిన ఉస్మాన్…. 2016 సంవత్సరంలో ఐపిఎల్ లోకి వచ్చాడు. రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ జట్టు తరఫున ఆడిన ఉస్మాన్ కవాజా… ఆ తర్వాత ఐపీఎల్ కు దూరమయ్యాడు.
అటు పాక్ మాజీ ఆటగాడు మహ్మద్ అమీర్ కూడా ఐపీఎల్ 2026 లో ఎంట్రీ ఇస్తాడట. బ్రిటీష్ పౌరసత్వం తీసుకున్న మహ్మద్ అమీర్… ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.