Jitesh Sharma: ఈనెల 22 నుండి ప్రారంభం కాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ కోసం అన్ని జట్టు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా జట్లు తమ కొత్త జెర్సీలను లాంచ్ చేశాయి. అలాగే ఐపీఎల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీ ప్రత్యేకంగా అన్బాక్స్ ఈవెంట్ ని నిర్వహించనుంది.
Also Read: Yuvraj Singh: విండీస్ ప్లేయర్ యూవీ దాడి.. 2007 ఫైట్ రిపీట్ !
ఈ ఈవెంట్ ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే ఈ ఈవెంట్.. ఐపీఎల్ కి ముందు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు ఫ్యాన్స్ మధ్య ఐపీఎల్ వార్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ని ట్రోల్ చేసింది ఆర్సిబి. విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో గైక్వాడ్ ని అవుట్ చేయడానికి అర్సిబిలో కొత్తగా చేరిన జితేష్ శర్మ {Jitesh Sharma} అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు.
అయితే ఆర్సిబి తన సోషల్ మీడియాలో గైక్వాడ్ అవుట్ అయిన క్లిప్ ని షేర్ చేస్తూ.. “ఇది ఆర్సిబి కి చెందిన వ్యక్తి” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక విదర్భకు చెందిన జితేష్ శర్మని గత సంవత్సరం నవంబరులో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సిబి రూ. 11 కోట్లకు ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ని కొనుగోలు చేసింది. అయితే తాజాగా జితేష్ శర్మ {Jitesh Sharma} కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఆర్సిబి కప్ సాధించిందంటే.. వరుసగా ఐదుసార్లు ట్రోఫీలను ఎగరేసుకుపోవడం పక్కా అని కామెంట్స్ చేశాడు.
దీంతో జితేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే జితేష్ వ్యాఖ్యలపై ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. ఇతర జట్ల అభిమానులు మాత్రం ఆర్సీబీని ట్రోలింగ్ చేస్తున్నారు. జితేష్ శర్మ 2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. పంజాబ్ కింగ్స్ కి 2022లో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 40 మ్యాచ్లు ఆడిన జితేష్ శర్మ.. 730 పరుగులు చేశాడు. ఇక భారత జట్టు తరఫున ఇప్పటివరకు 9 టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఈ తొమ్మిది మ్యాచ్ లలో 100 పరుగులు చేశాడు.
Also Read: Shami Daughter: రంజాన్ లో హోలీ.. మహ్మద్ షమీ కూతురిపై ట్రోలింగ్..!
కాగా ఐపీఎల్ లో ఇక ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ జట్టుకి మరో శుభవార్త అందింది. ఆర్సిబి లో గాయపడిన ఇద్దరు ఫారెన్ ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హెజిల్ వుడ్, ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ జాకబ్ బేతేల్ ఇద్దరూ పూర్తి ఫిట్నెస్ సాధించారు. ఈ ఇద్దరి రాకతో అర్సిబి జట్టు మరింత పటిష్టం కానుంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 17, 2025