BigTV English

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఒక్కొక్కరిగా స్పందిస్తున్న సినీ తారలు..!

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఒక్కొక్కరిగా స్పందిస్తున్న సినీ తారలు..!

Operation Sindoor:పహల్గామ్ పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా దాడి చేసిన విషయం హృదయాన్ని ద్రవింప చేసింది. అయితే ఇప్పుడు ఆ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత పాకిస్థాన్ పై విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా నిర్వహించింది భారత ఆర్మీ. ఇందులో 100మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్ మొదలు పెట్టడానికి ముందే అర్ధరాత్రి 1:28 గంటల సమయంలో ట్విట్టర్ ద్వారా పాకిస్థాన్ కి యుద్ధానికి సిద్ధం కమ్మని హింట్ ఇచ్చింది. పాకిస్తాన్ లాగా వెన్నుపోటు పొడవకుండా ధైర్యంగా ముందు యుద్ధం ప్రకటించి, ఆ తర్వాతే యుద్ధానికి దిగింది భారత్.


ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తున్న తారలు..

ఇకపోతే ఈ ఆపరేషన్ కి ‘సింధూర్’ అనే టైటిల్ పెట్టి పాక్ కు బలమైన సందేశం కూడా పంపింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం సైతం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే.. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేస్తూ “జైహింద్, జైహింద్ కి సేన.. భారత్ మాతాకీ జై.. న్యాయం జరిగింది” అంటూ ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు.


ALSO READ:Shahrukh Khan: పెళ్లయ్యాక ఆ హీరోయిన్ తో ఎఫైర్..గౌరీఖాన్ రియాక్షన్ ఇదే.!

ఆపరేషన్ సింధూర్ పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

ఇకపోతే సమాజంలో ఏం జరిగినా సరే వెంటనే రియాక్ట్ అయ్యే సెలబ్రిటీలలో చిరంజీవి (Chiranjeevi) కూడా ఒకరు అని చెప్పవచ్చు .ఇక ఈయన ఈరోజు ఉదయమే ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేస్తూ..” జైహింద్” అంటూ ట్వీట్ చేశారు.

ఖుష్బూ సుందర్ ట్వీట్..

“భారత్ మాతాకీ జై.. న్యాయం జరిగింది. జైహింద్” అంటూ ఖుష్బూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్:

రితేష్ దేశ్ ముఖ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా..” జైహింద్ కి సేనా.. భారత్ మాతాకీ జై” అంటూ ఆపరేషన్ సింధూర్ ను ట్యాగ్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్:

” మా ప్రార్థనలు మా దళాలతో.. ఒకే దేశం.. అంతా కలిసి నిలబడతాము..” అంటూ ట్వీట్ చేశారు.

మధుకర్ భండార్కర్ ట్వీట్:

” భద్రతా దళాలకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం.. ఒకే దేశం.. కలిసి నిలబడదాం.. వందేమాతరం” అంటూ ట్వీట్ చేశారు.

కళ్యాణ్ రామ్ ట్వీట్..

హీరో కళ్యాణ్ రామ్ ‘ఆపరేషన్ సింధూర్’ పై స్పందిస్తూ..”మన రక్షణ దళాలకు మరింత బలం మరియు శక్తి చేకూరాలి. #ఆపరేషన్ సింధూర్ అనేది పిరికివాడికి సమాధానం. #పహల్గామ్ టెర్రర్ దాడి గౌరవం, సంకల్పం, జ్ఞాపకం. జై హింద్”అంటూ స్పందించారు.

రజినీకాంత్ ట్వీట్..

సూపర్ స్టార్ రజినీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “యోధుడి పోరాటం ప్రారంభమవుతుంది… లక్ష్యం నెరవేరే వరకు ఆగదు! మొత్తం దేశం మీతోనే ఉంది..” అంటూ భారత సైన్యానికి ధైర్యాన్ని చేకూర్చేలా ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు.

యూ.వీ.క్రియేషన్స్ ట్వీట్..

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యూ.వీ.క్రియేషన్స్ ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ.. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా నిలిచింది .. జైహింద్..” అంటూ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ ట్వీట్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ.. “న్యాయం జరిగింది జైహింద్” అంటూ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ట్వీట్..

స్టార్ హీరో ఎన్టీఆర్ ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ.. “భారత సైన్యానికి మరింత బలం, శక్తి చేకూరాలి” అంటూ ట్వీట్ చేశారు.

నటుడు బ్రహ్మాజీ రియాక్షన్

ఆపరేషన్ సింధూర్‌పై నటుడు బ్రహ్మాజీ కూడా రియాక్ట్ అయ్యారు. జై హింద్ అంటూ ట్వీట్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టు ఓ ఫోటోను కూడా యాడ్ చేశాడు.

ధైర్యం లేని చోట స్వార్థం రాజ్యమేలుతుంది –  పవన్ కళ్యాణ్ ట్వీట్.. 

ఆపరేషన్ సింధూర్ పై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ స్పందించాడు. ధైర్యం లేని చోట.. ధర్మం కోల్పోతారు. ధైర్యం లేని చోట స్వార్ధం రాజ్యమేలుతుంది. అంటూ హిందీలో రాసుకొచ్చారు. చాలాసేపు నిశ్శబ్దాన్ని భరించి “ఆపరేషన్ సిందూర్” ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, అలాగే వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడికి ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×