KRK on Game Changer Movie : రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. దర్శకుడు శంకర్ గురించి రీసెంట్ లో ఉన్న ఆడియన్స్ కి తెలియదు కానీ ఒకప్పుడు శంకర్ సినిమా అంటేనే ఒక హై ఉండేది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అని అంటున్నారు. కానీ ఒకప్పుడు శంకర్ తీసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ లెవెల్ లో ఉండేది. కేవలం సినిమాలో తీయటమే కాకుండా సొసైటీకి పనికొచ్చే ఏదో ఒక అంశాన్ని తన సినిమాలో ఇంక్లూడ్ చేసేవాడు శంకర్. శంకర్ సినిమాలు అంటేనే విపరీతమైన అంచనాలు ఉండేవి. రీసెంట్గా అది బాగా తగ్గిపోయింది కారణం శంకర్ కూడా వరుసగా ప్లాప్ సినిమాలు తీయడం. రోబో సినిమా తర్వాత శంకర్ నుంచి బెస్ట్ వర్క్ అంటూ ఇప్పటివరకు రాలేదు. అందరి నమ్మకాలు గేమ్ ఛేంజర్ సినిమా పైన ఉన్నాయి.
ఈ సినిమా దాదాపు మూడేళ్ల క్రితం మొదలైంది. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మొత్తానికి రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి మొత్తం మూడు పాటలను రిలీజ్ చేశారు. మూడు మాటలు మంచి రెస్పాన్స్ సాధించాయి. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించాడు. ఇకపోతే రీసెంట్ గా పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన సక్సెస్ సాధించింది అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఈ తరుణంలో పుష్ప సినిమా మీద విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప మంచి సక్సెస్ సాధిస్తున్న తరుణంలో ప్రముఖ క్రిటిక్ కేఆర్ కే తన ట్విట్టర్ వేదికగా గేమ్ ఛేంజర్ సినిమా పైన సంచలమైన వ్యాఖ్యలు చేశాడు.
Mega Family hero @AlwayzRamCharan Bhojpuri film #GameChanager will release next month and it will be a sure shot disaster. And then Mega Family will understand that @alluarjun Icon star alone is 10 times bigger than entire mega family.😁🤪
— KRK (@kamaalrkhan) December 8, 2024
గేమ్ ఛేంజర్ అని ఒక సినిమా వస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదలవుతుంది. ఇది ఒక భోజ్ పురి సినిమా ఇది కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతుంది అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ ని అదే పోస్టులో పొగిడాడు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఒక్కడే మెగా ఫ్యామిలీ అందరికంటే పది రెట్లు గొప్ప అని ఫీల్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి కామెంట్స్ చేయటం ఈ క్రిటిక్ కి కొత్త విషయం కాదు. పుష్ప సినిమాకి ముందు కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అయితే కొంతమంది నెటిజన్స్ వీటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఇకపోతే గేమ్ ఛేంజర్ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఆసక్తిని కలిగించింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడకు తప్పదు.
Also Read : Drinker Sai Movie : కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు