
Pawan Kalyan:- పవన్ కల్యాణ్ ఫుల్ బిజీ. వరుస పెట్టి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ సరిగ్గా వచ్చే ఎన్నికల నాటికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓవైపు జనాల్లో, మరోవైపు ధియేటర్లలో.. ఇలా ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ మేనియా కనిపించేలా పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేనకు అడ్వాంటేజ్ ఇవ్వక్కర్లేదన్న ఆలోచనతో ఉన్న టీడీపీ… ఈ సినిమాలు, వచ్చే క్రేజ్‌ను చూసి పవన్‌ను కలుపుకొని వెళ్లాల్సిందేనన్న పరిస్థితి వస్తుందని ఫ్యాన్స్ ఏవేవో కాలిక్యులేషన్స్ లో ఉన్నారు.
ప్రస్తుతం ఎంత స్పీడ్‌గా షూటింగ్స్ జరుగుతున్నాయంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మే 11వ తేదీన రిలీజ్ కాబోతున్నట్టు సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. అదే రోజు ఎందుకు అంటే.. హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మే 11 నాటికి 11 ఏళ్లు అవుతుంది. అందుకే, ఆ రోజు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. గబ్బర్ సింగ్ ఎనర్జీకి తగ్గట్టే ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పేశాడు కూడా. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ సరికొత్త రికార్డ్స్ సృష్టించబోతోందని చెబుతున్నారు.
ఇక హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే, మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ్ సిత్తం రీమేక్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటుగా సుజీత్‌తో ఓజీ అనే గ్యాంగ్‌స్టర్ సినిమా చేస్తున్నాడు. ఈమధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి ఈ సినిమాను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు.
మొత్తానికి తన క్రేజ్ ఏంటో, తన సత్తా ఏంటో సినిమాల ద్వారా మరోసారి చూపించాలనుకుంటున్నాడు పవర్ స్టార్.