
Movie releases this week(Telugu cinema news) : ఈ వేసవి సీజన్ లో థియేటర్ల చాలా సినిమాలు సందడి చేశాయి. ఎక్కువగా చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక సమ్మర్ సీజన్ ఎండింగ్ లోనూ లోబడ్జెట్ మూవీస్ విడుదలకు సిద్ధమయ్యాయి. జూన్ రెండో వారంలో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల వినోదాన్ని పంచేందుకు వచ్చేస్తున్నాయ్.
సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్కర్. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో ఈ మూవీని రూపొందించారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో సందడి చేయనుంది.
వి.జె.సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం అన్‌స్టాపబుల్ విడుదలకు సిద్ధమైంది. ఇందులో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఈ నెల 9న విడుదల కానుంది.
సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా విమానం. ఈ మూవీలో మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. శివప్రసాద్ యానాల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూన్ 9న సినిమాను విడుదల చేయనున్నారు.
మాస్టర్ శశాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోయే ఏనుగు పోయే మూవీని కె.ఎస్.నాయక్ తెరకెక్కించారు. ఈ మూవీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్..
బర్రకుడ క్వీన్స్ (వెబ్‌సిరీస్)-జూన్ 05
ఆర్నాల్డ్ (వెబ్‌సిరీస్)-జూన్ 07
నెవర్ హావ్ ఐ ఎవర్ (వెబ్‌సిరీస్)-జూన్ 08
టూర్ డి ఫ్రాన్స్ (వెబ్‌సిరీస్)-జూన్ 08
బ్లడ్ హౌండ్స్ (కొరియన్ సిరీస్)-జూన్ 09
అమెజాన్ ప్రైమ్..
మై ఫాల్ట్ (హాలీవుడ్)-జూన్ 08
సోనీలివ్..
2018 (మలయాళం/తెలుగు)-జూన్07
జీ5..
ది ఐడల్ (వెబ్‌సిరీస్)-జూన్ 5
డిస్నీ+హాట్‌స్టార్..
అవతార్: ది వే ఆఫ్ వాటర్ (హాలీవుడ్)-జూన్ 07
సెయింట్ ఎక్స్ (వెబ్‌సిరీస్)-జూన్ 07
ఎంపైర్ ఆఫ్ లైట్ (హాలీవుడ్)-జూన్ 09
ఫ్లామిన్ హాట్ (హాలీవుడ్)-జూన్ 10

జియో సినిమా..
బ్లడ్ డాడీ (హిందీ)-జూన్ 09
యూపీ 65 (హిందీ సిరీస్)-జూన్ 08
యాపిల్ టీవీ ప్లస్..
ది క్రౌడెడ్ రూమ్ (వెబ్‌సిరీస్)-జూన్ 08