Actress Ramyasree: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి రమ్య శ్రీ (Ramya Sree)పై పట్టపగలే కొందరు వ్యక్తులు హత్యాయత్న ప్రయత్నం చేశారు. ఇలా తనతో పాటు తన సోదరుడిపై హత్యాయత్నం చేశారంటూ ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అసలు రమ్యశ్రీ పై హత్య ప్రయత్నం చేసింది ఎవరు? వీరిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే… హైదరాబాదులో ఇటీవల హైడ్రా (Hydra)పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా నేడు హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సీఐ కాలనీ లేఅవుట్ లోని రోడ్ల మార్కింగ్ హైడ్రా చేపట్టింది.
వీడియో చిత్రీకరిస్తుండగా..
ఈ కాలనీలో ఫ్లాట్ ఓనర్స్ సమక్షంలోనే హైడ్రా అధికారులు మార్కింగ్ వేశారు. అయితే ఈ సంఘటనలను వీడియోగా చిత్రీకరిస్తున్న ఫ్లాట్ యజమానిపై సంధ్య కన్వెన్షన్ యజమానికి శ్రీధర్ రావు అనుచరులు దాడికి ప్రయత్నం చేశారు. ఆ ఫ్లాట్ యజమాని సినీనటి రమ్యశ్రీ కావటం విశేషం. ఈమె తన సోదరుడితో కలిసి మార్కింగ్ వేస్తున్న సమయానికి తన ఫ్లాట్ దగ్గరే ఉన్నారు అయితే తన సోదరుడు వీడియో తీస్తున్న నేపథ్యంలో శ్రీధరరావు అనుచరులు తన సోదరుడిపై దాడికి దిగారని, క్రికెట్ బ్యాట్లు, కత్తితో దాడి చేశారని హత్య ప్రయత్నం చేశారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ దాడిలో భాగంగా సినీనటి రమ్యశ్రీ తో పాటు తన సోదరుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోంది.
కత్తితో దాడి…
ఈ విధంగా పట్టపగలే తమపై హత్య ప్రయత్నం చేయడంతో నటి రమ్యశ్రీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్టు వేయాలి అంటూ ఈమె ఎఫ్ఐఆర్ లో పేర్కొనడమే కాకుండా పోలీసులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తన పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ దాడిలో భాగంగా రమ్యశ్రీ సోదరుడు ఒంటి పై రక్తపు మరకలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియోని కూడా విడుదల చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తప్పిన పెను ప్రమాదం..
ఇకపోతే నటి రమ్యశ్రీ ఎన్నో తెలుగు సినిమాలలో నటించారు. అయితే ఈమె ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలలో నటించారని చెప్పాలి. రమ్యశ్రీ గత కొంతకాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ఒకసారిగా తనపై హత్యాయత్నం చేశారంటూ పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇది కాస్త సంచలనగా మారింది. ఇకపోతే ఈ దాడిలో నటి రమ్యశ్రీ సోదరుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆయనకైతే ఇలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది.
Also Read: Big TV Exclusive : సముద్రఖనితో పవన్ సినిమా ఫిక్స్… షూటింగ్ డేట్ ఇదే