BigTV English

HBD AR Rahman: ఆస్కార్ గ్రహీతకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

HBD AR Rahman: ఆస్కార్ గ్రహీతకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

HBD AR Rahman:ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman), తొలిసారి దిగ్గజ దర్శకులు మణిరత్నం (Maniratnam) దర్శకత్వం వహించిన ‘రోజా’ అనే సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి తెలుగు చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన, ఆ తర్వాత నుంచీ ఇప్పటికీ హవా కొనసాగిస్తున్నారు. మొదటి సినిమాతోనే ప్రజలకు కొత్త తరహా సంగీతాన్ని అందించి, సౌత్ సినిమా పరిశ్రమను తన వైపు తిప్పుకున్నారు. ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు అందుకోవడమే కాదు “మొజార్ట్ ఆఫ్ మద్రాస్” గా కూడా అభివర్ణించారు. సంగీత రంగంలో గత 30 ఏళ్లుగా యాక్టివ్ గా ఉన్న ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


వృద్ధాప్యంలో భార్యతో విడాకులు..

తన అద్భుతమైన సంగీతంతో శ్రోతలను మైమరిపింపచేసే ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఈయన వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. 57 ఏళ్ల వయసులో తన భార్య సైరా బాను (Saira Banu)ను నుంచి గత ఏడాది విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. 1995లో పెద్దల అంగీకారంతో వీరిద్దరి వివాహం జరిగింది. కానీ గత ఏడాది ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడిపోతున్నట్లు సైరా తరఫు లాయర్ ప్రకటించింది. పెళ్లయిన మూడు దశాబ్దాల తరువాత, ముగ్గురు పిల్లలు పెళ్లీడుకొచ్చిన తర్వాత విడాకులు తీసుకోవడంతో పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేశారు నెటిజన్స్. ఇక పెద్దమ్మాయికి పెళ్లయిపోయింది. రెండో అమ్మాయి చెఫ్ గా మారింది. ఇప్పుడు వీరి కొడుకు ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


ఏ ఆర్ రెహమాన్ ఆస్తుల విలువ..

ఇకపోతే ఏ ఆర్ రెహమాన్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం.. మొత్తం ఈయన ఆస్తి విలువ రూ.1728 కోట్లు.. సినిమాలు, సాంగ్స్, లైవ్ ఈవెంట్స్ ద్వారా మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లతో పేరుతోపాటు డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నారు. సినిమాలలో పాటలు పాడేందుకు ఒక్కో పాటకు రూ .3కోట్లు తీసుకునే ఏఆర్ రెహమాన్, ఒక్కో సినిమాకి సంగీతం అందించడానికి రూ.10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయనే కావడం గమనార్హం. ఇక లైవ్ షో చేశారంటే మాత్రం ఖచ్చితంగా రూ.2కోట్లు తీసుకుంటారు.

విదేశాలలో సొంత స్టూడియోలు..

ఈయన ఆస్తుల విషయానికొస్తే.. లాస్ ఏంజెల్స్ లో వున్న తన విలాసవంతమైన అపార్ట్మెంట్ ను స్టూడియో గా ఉపయోగిస్తున్నారు. అలాగే చెన్నైలో వ్యక్తిగత సంగీత స్టూడియో కూడా ఉంది. దుబాయ్ , లండన్ వంటి ఇతర దేశాలలో కూడా సొంత స్టూడియోలు ఉన్నాయి. రెహమాన్ కి కార్లు అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే వోల్వో ఎస్ యు వి, మెర్సిడెస్ బెంజ్ (రూ.3కోట్లు), జాగ్వార్ (రూ.1 కోటి), ఫోర్స్చే టైకాన్ EV వంటి కార్లు ఈయన గ్యారేజ్ లో ఉన్నాయి.

ఏ ఆర్ రెహమాన్ అందుకున్న అవార్డులు..

అవార్డ్స్ విషయానికి వస్తే.. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటివరకు రెండు ఆస్కార్ అవార్డులు, ఒక బాఫ్టా అవార్డు, పద్మభూషణ్ , రెండు గ్రామీ పురస్కారాలతో పాటు పలు అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు దశాబ్దాల కెరియర్ లో 2000 కి పైగా పాటలను కంపోజ్ చేశారు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×