AR Rahman :రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ డిజాస్టర్ కావడంతో ఆయన తన తదుపరి చిత్రంపై ఫోకస్ చేశారు. అందులో భాగంగానే ఆర్సి 16 (RC 16) అనే వర్కింగ్ టైటిల్ తో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR.Rahman) సంగీతాన్ని అందించబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్ గా అభిమానులకు షాక్ ఇస్తూ ఏ.ఆర్.రెహమాన్ తప్పుకోగా.. ఆ స్థానంలోకి దేవిశ్రీప్రసాద్ వచ్చి చేరినట్టు సమాచారం. అయితే ఇంత సడన్ గా ఏ.ఆర్.రెహమాన్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు చిత్ర బృందంతో ఏదైనా గొడవ జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో ఫ్యాన్స్ ఆరాతీస్తూ ఉండడం గమనార్హం.
సినిమాలకు శాశ్వత గుడ్ బై..?
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సంగీత దర్శకులు ఏ.ఆర్ రెహమాన్ ఒక్క RC16 చిత్రానికి మాత్రమే కాకుండా ఏకంగా సినిమా ఇండస్ట్రీకే ఆయన శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన భార్య సైరా భాను (Saira Bhanu).. తన భర్త నుండి విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో , ఒక్కసారిగా ఈ విషయం కలకలం సృష్టించింది. 29 ఏళ్ల వైవాహిక బంధానికి ఈ జంట స్వస్తి పలకడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపోతే విడాకులతో మనసు చిన్నగిలిపోయిన ఏ ఆర్ రెహమాన్ పూర్తిగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన ముస్లిం మతస్థుడు కాబట్టి అల్లా సేవలోనే మిగతా జీవితాన్ని గడిపేయాలని, అందులో భాగంగానే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తన అద్భుతమైన సంగీతంతో శ్రోతలను అలరించి, సినిమాలు సక్సెస్ సాధించేలా తన వంతు కృషి చేస్తున్న ఏఆర్ రెహమాన్ సడన్గా ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పనున్నట్లు వార్తలు రావడంతో, ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన సంగీత దర్శకుడు మళ్లీ తన స్వరాలను మనకు అందించరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ అభిమాన సంగీత దర్శకుడు ఎందుకు ఇలా మారిపోయారు అంటూ బాధపడిపోతున్నారు.
ఆర్ సి 16 లో ఏ.ఆర్.రెహమాన్ పాటలను ఉపయోగిస్తారా..?
ఇదిలా ఉండగా తాజాగా ఆర్సి 16 సంగీతానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వం లో వస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయిన వెంటనే కొన్ని పాటలకు ఆయన సంగీతాన్ని అందించారట. అయితే ఇప్పుడు ఈయన ఈ సినిమా నుండి తప్పుకొని, దేవిశ్రీప్రసాద్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో .. ఏ ఆర్ రెహమాన్ అందించిన పాటలను RC 16 సినిమాలో ఉపయోగిస్తారా? లేక పూర్తిగా అరెస్ట్ చేసి దేవిశ్రీప్రసాద్ అందించే పాటలను సినిమాలో ఉపయోగిస్తారా? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.