BigTV English

Game Changer Special Song: స్పెషల్ సాంగ్ కోసం శంకర్ భారీ ప్లాన్.. మాస్ బీట్స్ సిద్ధం చేస్తున్న థమన్!

Game Changer Special Song: స్పెషల్ సాంగ్ కోసం శంకర్ భారీ ప్లాన్.. మాస్ బీట్స్ సిద్ధం చేస్తున్న థమన్!

Special Ram Charan’s Game Changer Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఈ మూవీ చేస్తున్న తొలి సినిమా ఇది. అందువల్లనే ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను సైతం కొల్లగొట్టడమే కాకుండా.. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ కీర్తిని మరో స్థాయికి తీసుకెళ్ళింది.


ఈ సినిమాతో చరణ్ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అందువల్లనే ‘గేమ్ ఛేంజర్’ మూవీని మరింత గ్రాండ్‌ లెవెల్లో చూపించేందుకు దర్శకుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే క్వాలిటీ, కంటెంట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఈ మూవీ స్టార్ట్ చేసి దాదాపు రెండేళ్లకు పైగా అయింది. అయినా ఇంకా షూటింగ్ జరుపుకుంటుందంటే.. దర్శకుడు ఈ చిత్రాన్ని ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘జరగండి జరగండి’ సాంగ్ సినీ ప్రేక్షకాభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సాంగ్‌లో చరణ్ క్లాసిక్ స్టెప్స్ ఓ ఎత్తయితే.. అందులోని కలర్ ఫుల్ లొకేషన్స్ మరో ఎత్తనే చెప్పాలి. ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా అలరించింది. అయితే ఆ సాంగ్ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ మేకర్స్ అందించలేదు. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి మాంచి కిక్కిచ్చే ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.


Also Read: హమ్మయ్య.. ముగింపు దశకు చేరుకున్న ‘గేమ్ ఛేంజర్’

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. తాజా షెడ్యూళ్లను రాజమండ్రిలో చిత్రీకరిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే దర్శకుడు శంకర్ ఇందులోని స్పెషల్ సాంగ్‌ కోసం ఎక్కువగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ సాంగ్‌ కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాస్ బీట్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్ సినిమాకే మెయిన్ హైలైట్‌గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఈ అప్డేట్‌తో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇకపోతే ఈ మూవీలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. ఒకటి తండ్రి పాత్ర.. మరొకటి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇందులో తండ్రి పాత్ర అయిన ‘అప్పన్న’ రోల్‌లో చరణ్ నట విశ్వరూపం చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే కొడుకు పాత్ర ‘రామ్ నందన్’గా చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా దుమ్ముదులిపేస్తాడని అంటున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×