AR Rahman: మ్యూజిక్ లెజెండ్… ఇసై పుయల్ ఏ.ఆర్. రెహమాన్ కి హార్ట్ ఎటాక్ రావడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు.
ఆదివారం ఉదయం 7:30 గంటలకు సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కి ఛాతీ నొప్పి రావడంతో… అతనికి తీవ్రమైన ఛాతీ నొప్పి అనిపించింది, అతని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు రెహమాన్ ని చెన్నైలోని గ్రీమ్స్ రోడ్ లో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు అతనికి ECG మరియు ఎకో కార్డియోగ్రామ్‌తో సహా అనేక పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ రెహమాన్ కి స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రెహమాన్ హెల్త్ స్టేటస్ పై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన బయటకి రానప్పటికీ ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం రెహమాన్ స్టేబుల్ గా ఉన్నారట. రెహమాన్ కి హార్ట్ ఎటాక్ అనే న్యూస్ బయటకి రాగానే సంగీత అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో కాస్త భయం మొదలయ్యింది కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, రెహమాన్ బాగానే ఉన్నాడని సమాచారం.
వార్తా సంస్థ PTI ప్రకారం, A.R. రెహమాన్ ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను తీవ్రమైన మెడ నొప్పిని ఎదుర్కొన్నాడు. దీని తర్వాత అతను ఛాతీ నొప్పి గురించి పలుమార్లు సన్నిహితులకి తెలిపాడట. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఏఆర్ రెహమాన్ కుటుంబ సభ్యుల నుంచి ప్రెస్ నోట్ బయటకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే రెహమాన్ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ రాలేదు. 58 సంవత్సరాల ఏఆర్ రెహమాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని నెలల క్రితం వార్తల్లో నిలిచాడు. ఇటీవలే ఆయన మాజీ భార్య సైరా బాను శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో అతను రెహమాన్‌కి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ విడిపోయారన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏఆర్ రెహమాన్, సైరా దంపతులకు ఈ వివాహంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. గత ఏడాది నవంబర్‌లో, ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు మరియు ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు.