Central America Tornadoes Havoc| అమెరికాలో వివిధ ప్రకృతి వైపరీత్యాల కారణంగా మొత్తం 33 మంది మరణించారు. కొన్ని రాష్ట్రాలు తీవ్రమైన తుఫానులకు గురైనప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో సుడిగాలులు విధ్యంసం సృష్టించాయి. మరికొన్ని ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు కారణంగా స్థానికుల ఇళ్లు వదిలి పరుగులు తీశారు. మిస్సౌరీ రాష్ట్రంలో దుమ్ము, ధూళితో కలగలిసిన సుడిగాలి కారణంగా 11 మంది మరణించారని, 29 మందికి పైగా గాయపడ్డారని స్టేట్ హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి అర్కాన్సాస్ రాష్ట్రంలోని ఇండిపెండెన్స్ కౌంటీలో ముగ్దురు మరణించగా, 29 మంది గాయపడ్డారు. టెక్సాస్ లోని అమరిల్లో ధూళి, పెను తుఫాను కారణంగా మరో ముగ్దురు మరణించారు. ఈ రాష్ట్రాల్లో 100 కు పైగా ప్రాంతాల్లో కార్చిచ్చు (wildfire) కారణంగా అగ్నిప్రమాదాలు జరిగాయి. అర్కాన్సాస్ గవర్నర్ సారా హకాబీ సాండర్స్ ఎమర్జెన్సీని ప్రకటించి.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి సాయం కోరారు.
దేశవ్యాప్తంగా 16 కౌంటీల్లో అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు నష్టపోయాయని, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, చెట్లు కూలిపోయాయని అర్కాన్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఒక ప్రకటనలో తెలిపింది. టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో కౌంటీలో సంభవించిన కారు ప్రమాదాల్లో ముగ్దురు మరణించారని అధికారులు తెలిపారు. మిస్సౌరీలోని బేకర్స్‌ఫీల్డ్ ప్రాంతంలో తుఫానుల (storm) కారణంగా ఇద్దరు మరణించారని, అనేక మంది గాయపడ్డారని మిస్సౌరీ స్టేట్ హైవే పెట్రోల్ తెలిపింది. మిస్సౌరీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. అడవులలో 100 కు పైగా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు వ్యాపించాయి. ఈ పరిస్థితుల్లో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
Also Read: తైవాన్‌కూ ఉక్రెయిన్ గతే.. సెమీకండక్టర్ చిప్‌లపై ట్రంప్ కన్ను
బేకర్స్‌ఫీల్డ్‌కు తూర్పున 177 మైళ్ల దూరంలోని ఒక ఇంటిని సుడిగాలి చుట్టుముట్టడంతో ఒకరు మరణించారని, మరో మహిళను రక్షణ దళాలు రక్షించాయని అధికారులు తెలిపారు. అర్కాన్సాస్ లోని కేవ్ సిటీ ప్రాంతంలో సుడిగాలి కారణంగా ఐదుగురు గాయపడ్డారని, ఈ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించినట్లు మేయర్ జోనాస్ ఆండర్సన్ తెలిపారు.
ఇక మిస్సిసిప్పీ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయినట్లు, ముగ్గురు తప్పిపోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ మీడియాకు తెలిపారు. కాన్సాస్ రాష్ట్రంలో అయితే దుమ్ము తుపాను (tornado) కారణంగా 50 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో హైవే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ ఘటనల్లో అక్కడ 8 మంది మరణించారు. మిస్సోరి రాష్ట్రంలో మొత్తం 12 మంది తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో చనిపోయారని.. సముద్రంలో షిప్పులన్నీ ప్రమాదానికి గురై ఒకదాని మీద ఒకటి వచ్చి పడ్డాయని స్థానిక మీడియా తెలిపింది.
శనివారం సాయంత్రం నుంచి మొత్తం సెంట్రల్ అమెరికా రాష్ట్రాలన్నింటిలో 2 లక్షలకు పైగా ఇళ్లలో కరెంటు లేదు. తుపాను కారణంగా ఇళ్లు, షాపులన్నీ దెబ్బతిన్నాయి. రోడ్లపై కార్లతో పాటు పెద్ద పెద్ద ట్రక్కులు కూడా బోల్లా పడినట్లు మీడియా ఫొటోలు షేర్ చేసింది. అయితే ఈ తుపాను ఇంకా తీవ్రం కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.