Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో అనుకున్న స్థాయిలో సినిమాలను చేయలేకపోతున్నారు. ఈయన జనసేన పార్టీని (Janasena Party)స్థాపించిన తర్వాత తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమే కృషి చేస్తూ వచ్చారు.. ఇక గత ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు.
ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూనే తనకు వీలైనప్పుడల్లా కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా విడుదలకు కూడా సిద్ధమైంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ముఖ్యంగా నిర్మాత ఏ. యం రత్నం (A.M.Ratnam) గారు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను బయట పెడుతూ వచ్చారు.
థియేటర్ల బంద్ కు పిలుపు…
ఇకపోతే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన గత కొన్ని సినిమాల విషయంలో ఆయన చాలా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత థియేటర్లు బంద్ అంటూ ఒక ప్రకటన బయటకు వచ్చింది. ఇలా తన సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ అని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సినిమా ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఒక నోట్ విడుదల చేశారు. ఇలా తన సినిమా సమయంలో థియేటర్లు బంద్ అని ప్రకటించడంతో పవన్ చాలా బాధపడ్డారని నిర్మాతరత్నం తెలిపారు.
టికెట్ల రేట్లు తగ్గించారు…
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత చూపించారు. ఆయన నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి సినిమాలకు పూర్తిస్థాయిలో టికెట్ల రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటూ పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేసింది. ఇప్పుడు తన ప్రభుత్వ హయాంలో కూడా తన సినిమాకు న్యాయం జరగకపోవడంతో నా సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ కొంతమేర బాధపడ్డారు అంటూ నిర్మాత రత్నం తెలియజేశారు. వీరమల్లు సినిమా విడుదలకు ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాని అడ్డుకోవడం కోసం థియేటర్ బంద్ కు పిలుపునిచ్చారని వార్తలు రావడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలను సృష్టించిన సంగతి తెలిసిందే.