Nitish Reddy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగోవ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలే తడబడిన మెల్ బోర్న్ పిచ్ పై క్రీడాభిమానులను ఫిదా చేసే ఇన్నింగ్స్ ఆడాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. 150 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న స్టేడియంలో, ఆస్ట్రేలియాలో అత్యంత జనాధరణ గల మైదానంలో.. ఈ స్టేడియంలో ఓ ఆఫ్ సెంచరీ చేసినా క్రీడాభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారనే పిచ్ పై ఏకంగా మొదటి సిరీస్ లోనే సెంచరీ సాధించి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి.
Also Read: Chandrababu on Nitish Kumar: నితీష్ సెంచరీపై చంద్రబాబు రియాక్ట్..రూ. 25 లక్షల భారీ నజరానా ప్రకటన!
ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి దిగ్గజ బ్యాటర్లే చేతులెత్తేసిన సమయంలో నితీష్ కుమార్ రెడ్డి మాత్రం జట్టుకి అండగా నిలబడ్డాడు. పట్టుదలతో ఆడుతూ ఆస్ట్రేలియా బెండు తీశాడు. ఓ తెలుగోడి పొగరు ఏంటో ఆస్ట్రేలియాకి చూపించాడు. సెంచరీ చేసి మ్యాచ్ ని భారత్ వైపు తిప్పాడు. నితీష్ దెబ్బకి ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనపడ్డాయి. 8వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సెంచరీ సాధించాడు.
క్లిష్ట సమయంలో భారత్ కి విలువైన పరుగులని అందించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బాక్సింగ్ డే టేస్ట్ లో తన కెరీర్ లో బౌండరీ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ లో ” తగ్గేదేలే” అన్నట్లుగా బ్యాట్ తో సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఆఫ్ సెంచరీ చేసిన వెంటనే సోషల్ మీడియాలో నితీష్ వీడియోలు సోషల్ వీడియోలు వైరల్ గా మారాయి. కానీ నితీష్ మాత్రం హాఫ్ సెంచరీతోనే ఆగలేదు. ఆసీస్ బౌలర్ల పదునుకు తన బ్యాట్ తో విరుగుడు మంత్రం రచించాడు.
8 వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన నితీష్.. 171 బంతుల్లో 105 పరుగులు సాధించి భారత జట్టును ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. నితీష్ సెంచరీ చేసిన సమయంలో ఆయన తండ్రి ముత్యాల రెడ్డి ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తూ.. కొడుకు సెంచరీ తో చెలరేగిన దృశ్యాలను చూసి భావోద్వేగానికి గురైయ్యాడు. తన బ్యాటింగ్ లో నితీష్ కుమార్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్ లా అడ్డగోలు షాట్లకు పోకుండా క్రేజ్ లో నిలదొక్కుకున్నాడు.
Also Read: IND vs AUS: మైదానంలో కండోమ్ బెలూన్ కలకలం.. వీడియో వైరల్
హాఫ్ సెంచరీ చేసిన సమయంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్ చేసిన నితీష్.. సెంచరీ సాధించిన సమయంలో తన బ్యాట్ తో బాహుబలి, సలార్ సినిమాలలో రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన మాదిరిగా బ్యాట్ ని నేలకు ఆనించి.. పైకి చూస్తూ దేవుడిని తలుచుకున్నాడు. దీంతో అతడి స్వాగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇది తెలుగోడి దెబ్బ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక నితీష్ సెంచరీపై పలువురు రాజకీయ నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.