Nag Ashwin : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అందులో ఒకటి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ను నమోదు చేసుకుంటుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఖలేజా. చాలామందికి ఖలేజా సినిమా ఫేవరెట్ అని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రతి సీన్లోని కూడా మహేష్ బాబు విజృంభించి చేస్తాడు. మహేష్ లోని కామెడీ టైమింగ్ ను బయటికి తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ బయటకు తీయడం వలన దూకుడు సినిమాకి పెద్ద ప్లస్ అయింది. దూకుడు ఎటువంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. శ్రీను వైట్ల కెరియర్లో బెస్ట్ ఫిలిం అది.
ఖలేజా గురించి నాగ అశ్విన్
ఖలేజా సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు అని అందరికీ తెలిసిన విషయమే. అందులో నాగ అశ్విన్ కూడా ఒకరు. రీసెంట్ గా ఒక ఈవెంట్ కు హాజరైన నాగ అశ్విన్ కు ఏదైనా సినిమా చూసినప్పుడు ఇది నేను డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించిందా అని అడిగితే. నాకు ఇప్పటివరకు అలా ఏ సినిమా అనిపించలేదు కానీ ఈ సినిమా నేను ఎడిట్ చేస్తే బాగుంటుంది అని ఒకటి రెండు సినిమాలనిపించాయి అంటూ చెప్పుకొచ్చారు. అందులో ఖలేజా డియర్ కామ్రేడ్ సినిమాలను ప్రస్తావించాడు నాగ్ అశ్విన్. ఖలేజా సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్వినికి మాత్రం ఎడిటింగ్ లోనే ప్రాబ్లం ఉంది సినిమా అంతా కూడా తనకు విపరీతంగా నచ్చింది. అయితే ఒకవేళ నాగ్ అశ్విన్ ఎడిట్ చేసి ఉంటే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది. కానీ అది ఎప్పటికీ జరగని పని. ఆ పనిని జరిగేలా చూస్తే మాత్రం అది ఒక అద్భుతం అని చెప్పాలి. డియర్ కామ్రేడ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించక పోయినా కూడా ఆ సినిమాకి డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఖలేజా ప్రత్యేకత
త్రివిక్రమ్ ఒక అద్భుతమైన పాయింట్ ను చాలా సాధారణంగా ఎంటర్టైన్మెంట్ వే లో అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. కానీ ఎంటర్టైన్మెంట్ హెవీ అయిపోవడం వలన సినిమాలో చెప్పాల్సిన పాయింట్ ఎక్కడో కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఒక సందర్భంలో మహేష్ బాబు దేవుడు గురించి ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ చాలామందికి అద్భుతంగా అనిపించింది. వాస్తవానికి ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే మంచి సక్సెస్ సాధిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఖలేజా సినిమాను మే 31న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : Nag Ashwin: ఆ సినిమా వల్ల వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిన నాగ్ అశ్విన్.. ఇంతకీ ఏంటా సినిమా.?