Jr NTR: సినీ సెలబ్రిటీలు చాలావరకు సింపుల్‌గా ఉన్నట్టే కనిపిస్తారు. కానీ వారు ధరించే షర్టులు, వాచ్‌లు, షూస్.. వీటి ధరలు మాత్రం ఒక రేంజ్‌లో ఉంటాయి. ముఖ్యంగా తెలుగులో చాలామంది స్టార్ హీరోలకు ఇలాంటి కాస్ట్‌లీ వస్తువులపై ప్రత్యేకమైన ఇష్టం ఉంది. అలాంటి వారిలో ఎన్‌టీఆర్ ఒకడు. అందుకే తను ఎక్కడికి వెళ్లినా అసలు ఎలాంటి షర్ట్ వేసుకున్నాడు, చేతికి ఎలాంటి వాచ్ పెట్టుకున్నాడు, ఏ డ్రింక్ తాగుతున్నాడు.. ఇలాంటివి తెగ వైరల్ అవుతాయి. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు ఎన్‌టీఆర్. అక్కడ తను ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తను ధరించిన షర్ట్ ధర ఎంత అనే విషయం బయటికొచ్చింది. అది తెలిసి అంతా షాకవుతున్నారు.
అక్కడికే టూర్లు
ఎన్‌టీఆర్ ‘దేవర’ ప్రమోషన్స్ కోసం చాలాకాలంగా జపాన్‌కు వెళ్లొస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత ఇప్పుడు దుబాయ్‌కు బయల్దేరాడు. ప్రస్తుతం తన చేతిలో పలు అప్‌కమింగ్ సినిమాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇతర సినిమా ఈవెంట్స్‌లో పాల్గొంటూ మధ్య మధ్యలో ఇలా టూర్స్‌కు వెళ్లి వస్తూ ఉన్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న తర్వాత దుబాయ్‌కు బయల్దేరాడు ఎన్‌టీఆర్. అక్కడి ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. తాజాగా తన చిన్న కుమారుడు భార్గవ రామ్‌తో కలిసి కనిపించాడు. బ్లూ కలర్ షర్ట్‌లో ఎన్‌టీఆర్ కనిపించగానే ఆ షర్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన నెటిజన్లు దాని ధర తెలుసుకోవడం మొదలుపెట్టారు.
అంత సింపుల్ కాదు!
సింపుల్‌గా కనిపించినా కూడా ఎన్‌టీఆర్ (NTR) వేసుకున్న ఆ బ్లూ షర్ట్ ధర రూ. 85 వేలు అనే విషయం బయటికొచ్చింది. దీంతో ఈ సినీ సెలబ్రిటీలంతా చాలా సింపుల్‌గా కనిపించినా వారి షర్ట్స్ ధరలు మాత్రం చాలా కాస్ట్‌లీ ఉంటాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌టీఆర్ ఏం ధరించినా అది కచ్చితంగా కాస్ట్‌లీ ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఎన్‌టీఆర్ మాత్రం తన తరువాతి సినిమాలపై ఫోకస్ చేయకుండా ఇలా టూర్స్‌కు వెళ్తున్నాడేంటి అని కూడా ఫ్యాన్స్‌లో చర్చలు మొదలయ్యాయి. ‘దేవర’ విడుదలయ్యి చాలాకాలం అయ్యింది. అయినా మరొక సినిమా సెట్‌లో అడుగుపెట్టలేదు ఈ హీరో.
Also Read: మళ్లీ రిలాక్స్ అవుతున్న యంగ్ టైగర్.. మరి ఆ మూడు సినిమాల పరిస్థితేంటయ్యా.?
జపాన్‌లో ఫ్యాన్స్ కోసం
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్‌టీఆర్ హీరోగా నటించిన చిత్రమే ‘దేవర’. ఆ సినిమా ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్స్‌తో సూపర్ హిట్ సాధించింది. మొదట్లో మూవీ యావరేజ్ అని టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రమే బాగానే వచ్చాయి కాబట్టి కాస్త లాభాలను కూడా అందుకుంది. ఇండియా, ఓవర్సీస్‌లో ‘దేవర’ హిట్ అవ్వడంతో దీనిని జపాన్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే జపాన్‌లో తన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయడం కోసం ‘దేవర’ ప్రమోషన్స్ కోసం నేరుగా అక్కడికి బయల్దేరాడు ఎన్‌టీఆర్. అక్కడ కూడా ఈ మూవీకి మంచి కలెక్షన్స్ సాధించి హిట్ కొట్టింది.
Family vacation at UAE
NTR and Bhargava Ram spotted 🤩📷@tarak9999#ManOfMassesNTR #NTR #JrNTR #BIGTVcinema pic.twitter.com/DK3p5TURev
— BIG TV Cinema (@BigtvCinema) April 15, 2025