BigTV English
Advertisement

PM Narendra Modi: త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం..

PM Narendra Modi: త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం..

PM Narendra Modi: అతిపెద్ద ఆధ్మాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాకు ఒక భారతదేశం నుంచే కాక.. ప్రపంచ వ్యాప్తంగా నలు దిక్కుల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. సంగమ్ వద్ద బోట్ ఆయన విహారించారు. ప్రధాని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. అనంతరం నదిలోకి దిగి గంగాదేవి ప్రార్థన, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రధానితో ఉన్నారు. ముందు ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నుంచి అరైల్ ఘాట్‌కు వచ్చారు. ఘాట్ నుంచి పడవలో మహాకుంభమేళా జరుగుతోన్న స్థలానికి వచ్చారు. పుణ్యస్నానం, ప్రత్యేక పూజల అనంతరం సాధు సంతులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మహాకుంభ మేళా ఏర్పాట్లపై ప్రధాని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రయాగ్ రాజ్‌లో గత నెల 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఒక్క భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కుంభమేళాకు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. మహాకుంభ మేళా ఇంకా 20 రోజుల పాటు కొనసాగనుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కుంభమేళా జరగనుంది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 39 కోట్లకు పైగా భక్తులు గంగా, యమునా, ఆధ్మాత్మిక సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.

ప్రస్తుతం, మహా కుంభమేళా 24వ రోజు కొనసాగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు పోటేత్తి వస్తున్నారు.. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం వద్ద కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 39 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు. కాగా.. ఈ రోజు ఉదయం 37 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో 10 లక్షల మంది కల్పవాసీలు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున ముగియనుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గట్లుగానే భక్తులును దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసింది.


Related News

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Big Stories

×