BigTV English

Trump Eyeing Ukraine Mines : సాయం చేశాం బదులుగా అది కావాలి.. ఉక్రెయిన్ ముక్కు పిండి వసూలు చేస్తున్న ట్రంప్..

Trump Eyeing Ukraine Mines : సాయం చేశాం బదులుగా అది కావాలి.. ఉక్రెయిన్ ముక్కు పిండి వసూలు చేస్తున్న ట్రంప్..

Trump Eyeing Ukraine Rare Earth Minerals | ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి వారు తప్పక కలిసి తీరాలని అన్నారు. తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.


యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్కు భారీగా ఆయుధ, ఆర్థిక సాయం అందించిందని అన్నారు. బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ దేశానికి అగ్రరాజ్యం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. దానికి బదులుగా అమెరికా కంపెనీలకు ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న విస్తార సహజ వనరులు (రేర్ అర్త్ మినరల్స్) ఇవ్వాలని ట్రంప్ కోరారు. ఈ ఒప్పందానికి జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికితీసేందుకు గాను ఆ దేశంతో ట్రంప్ 500 బిలియన్ డాలర్ల మేరకు డీల్‌ని ఇటీవల ప్రతిపాదించినట్లు ఒక బ్రిటన్ వార్తాపత్రిక కథనం ప్రచరించింది.

ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలతోపాటు చమురు, గ్యాస్, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే అగ్రరాజ్యం అమెరికా, ఉక్రెయిన్ నుంచి కోరుతున్న మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్లపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువని బ్రిటన్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందం కుదిరితే.. ఉక్రెయిన్లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలను నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్ నియంత్రణ సాధించే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ పత్రిక తెలిపింది. ఏవిధంగా చూసినా, దీనివల్ల ఉక్రెయిన్ కు తక్కువ అమెరికాకు లాభం చేకూరే అవకాశం ఉండడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ డీల్‌ని తిరస్కరించినట్లు వెల్లడించింది.


Also Read: ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు.. జెలెన్‌స్కీకి మద్దతుగా బ్రిటన్‌ ప్రధాని

ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ..ఉక్రెయిన్‌కు తాము 500 బిలియన్ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించామన్నారు. దానికి జెలెన్స్కీ సైతం అంగీకరించారని తెలిపారు. తమకు ఖనిజాలు లభిస్తే.. ఆ దేశానికి అవసరమైన వాటిని (ఆయుధాలు, ఇతర ఉత్పత్తులు) అందిస్తామన్నారు. మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ ఇరుదేశాలు అమెరికన్ కంపెనీలకు ఉపయోగపడే పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉద్యోగాలు సృష్టించవచ్చని అన్నారు. అయితే ఇందులో ఉక్రెయిన్ సరైన లాభాం ఉంటేనే అయన ఈ ఒప్పందానికి అంగీకరించే అవకాశాలున్నాయి.

జెలెన్‌స్కీ అంగీకరించపోతే యుద్దంలో ట్రంప్.. రష్యా వైపు మొగ్గు చూపే అవకాశముంది. పైగా జెలెన్‌స్కీ అధ్యక్ష పదవీకాలం ముగిసిందని.. ఆయనకు ప్రజల మద్దతు లేదని ఉక్రెయిన్ లో ఎన్నికలు నిర్వహించాలని కూడా ట్రంప్ వాదిస్తున్నారు. ఇవన్నీ జెలెన్‌స్కీని తప్పించి ఆయన స్థానంలో అమెరికాతో డీల్ చేసుకునేందుకు ఒప్పుకునే అధ్యక్షుడిని తెచ్చుకునే ప్లాన్ లో భాగమేనని జియో పాలిటిక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే త్వరగా అమెరికా కంపెనీలకు ఉక్రెయిన్ ఖనిజ సంపద చవకగా లభిస్తుంది. మరి పక్కా బిజినెస్ మెన్ కదా..

అందుకే సౌదీ అరేబియాలో ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు రష్యాతో (US-Russia talks) చర్చలు జరుపుతున్నారు. ఉక్రెయిన్‌ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలివిడత సమాలోచనలు జరిపారు. చర్చల్లో ఉక్రెయిన్‌ అధికారులు పాల్గొనకపోయినా కొనసాగిస్తున్నారు. అందుకు జెలెన్‌స్కీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయనను ట్రంప్ నియంత అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా యుద్దం ముగియాలంటే పుతిన్, జెలెన్‌స్కీ కలవాల్సిన అవసరం ఉందని.. అమాయక ప్రజలు చావకుండా ఉండాలంటే ఇది తప్పక జరగాలని ట్రంప్ చెప్పారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×