BigTV English

Naga Chaitanya – Shobhita: పిల్లల గురించే ధ్యాసంతా.. మరి సమంతతో ఏమైంది..?

Naga Chaitanya – Shobhita: పిల్లల గురించే ధ్యాసంతా.. మరి సమంతతో ఏమైంది..?

Naga Chaitanya – Shobhita.. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాల (Shobhita dhulipala)మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం శ్రీశైల మల్లన్నను నాగార్జున (Nagarjuna)తో కలిసి దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ జంట కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా మరోపక్క నాగచైతన్య – శోభిత ఎక్కువగా పిల్లల గురించి మాట్లాడుతుండడంతో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా అటు నాగచైతన్య, ఇటు శోభిత పిల్లలు కావాలని, భవిష్యత్తులో వారితో సంతోషంగా గడపాలని మీడియాతో చెబుతుంటే సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పెళ్లి పిల్లలపై శోభిత అలాంటి కామెంట్స్..

నాగచైతన్య – సమంత (Samantha) తో విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత.. నాగచైతన్య శోభిత ప్రేమలో పడి రహస్యంగా డేటింగ్ చేశారు. కొన్నాళ్లు ప్రేమించుకున్న వీరు ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకొని డిసెంబర్ 4న వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన సరే.. ఎక్కువగా పిల్లల గురించి, పెళ్లి గురించే మాట్లాడుతున్నారు.తన సినిమా ప్రమోషన్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో..” నాకు తల్లి కావాలని ఉంది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని సెటిలైపోతాను. కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తాను” అంటూ తెలిపింది.


50 ఏళ్లు వచ్చాక భార్యా, పిల్లలతో సెటిలైపోతా..

ఇటు నాగచైతన్య కూడా రానా దగ్గుబాటి (Rana daggubati)టాక్ షోలో మాట్లాడుతూ.. “నాకు ఇద్దరు పిల్లలు కావాలి. 50 ఏళ్లు వచ్చేసరికి భార్య, పిల్లలతో కుటుంబాన్ని గడపాలి. పిల్లలతో ఎక్కువగా సమయం స్పెండ్ చేయాలి” అని తెలిపాడు. ఇలా ఇద్దరు కూడా పెళ్లి, పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుతుండడంతో సమంత గురించిన చర్చ వినిపిస్తోంది.

సమంత – నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం పిల్లలేనా..?

గతంలో నాగచైతన్య , సమంత విడిపోవడానికి కారణాలు బోలెడు వినిపించాయి. అలాంటి రూమర్స్ లో అక్కినేని ఫ్యామిలీ, నాగచైతన్య పిల్లలు కావాలని అనుకుంటే.. సమంత మాత్రం పిల్లలు వద్దని చెప్పిందని, ఇప్పుడే పిల్లలు కనడానికి ఆమె ఇష్టపడలేదనే రూమర్లు గట్టిగా వినిపించాయి. ఇప్పుడు వీరిద్దరూ కూడా పెళ్లి, పిల్లల గురించి మాట్లాడుతుండడంతో సమంత గురించి వచ్చిన రూమర్ నిజమేనని, నెటిజన్లతో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు. నిజానికి వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ ఇప్పుడు ఈ రూమర్స్ కి తగ్గట్టుగా చైతన్య , శోభిత మాట్లాడడంతో పిల్లల విషయంలోనే నాగచైతన్య , సమంత విడిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సమంత , నాగచైతన్య ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకొని వారి పనులతో బిజీగా మారారు. మరి త్వరలోనే అనుకున్నట్టుగా నాగచైతన్య – శోభిత తల్లిదండ్రులవుతారేమో చూడాలి. ఇక నాగచైతన్య సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×