Naga Chaitanya Shobhita Marriage: అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తన మొదటి భార్య సమంత (Samantha ) నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. నాలుగేళ్లు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న సమంత, నాగచైతన్య అనూహ్యంగా విడిపోయి, అందరిని ఆశ్చర్యపరిచారు. సమంత నుంచి విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది నాగచైతన్య, శోభిత ధూళిపాళ (Shobhita Dulipala) ప్రేమలో పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకుని, అందరిని ఆశ్చర్యపరిచారు ఈ జంట. ఇదిలా ఉండగా మరోవైపు సమంత తన కెరియర్ పైన దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.
పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత – చైతూ కుటుంబాలు..
ఇకపోతే నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య – శోభిత ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. దీనికి తోడు శోభిత ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. పసుపు దంచడం, గోధుమ రాయి వంటి కార్యక్రమాలలో శోభిత స్వయంగా పాల్గొని,ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకునే సమయంలో సడన్గా వేణు స్వామి(Venuswamy ) మాటలు తెరపైకి వచ్చాయి. నాగచైతన్య – శోభిత వివాహం చేసుకుంటే వీరిద్దరి జాతకం ప్రకారం 2027లో విడాకులు తీసుకుంటారు అంటూ ఆయన హాట్ బాంబ్ పేల్చారు. దీనికి తోడు నాగార్జున (Nagarjuna)ఇద్దరి జాతకాలను పండితుడి దగ్గరకు తీసుకెళ్తే.. వారు కూడా అదే చెప్పారని, అందుకే వీరిద్దరి పెళ్లిపై నాగార్జున పునరాలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు గుప్పించారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన శుభలేఖ..
అయితే ఇలాంటి వార్తలు వస్తున్న వేళ సడన్గా పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పెళ్లి శుభలేఖ అంటే ఎంతో గ్రాండ్ గా ఉంటుంది. కానీ నాగచైతన్య – శోభిత ల వెడ్డింగ్ కార్డు మాత్రం చాలా సింపుల్ గా, ట్రెడిషనల్ గా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. నాగ చైతన్య వెడ్డింగ్ కార్డులో డిసెంబర్ 4వ తేదీన వివాహం అని ముద్రించారు. అలాగే వధూవరుల తల్లిదండ్రుల పేర్లతో పాటు నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి (Daggubati Lakshmi), ఆమె రెండవ భర్త శరత్ విజయరాఘవన్ (Sarath Vijayaraghavan) పేర్లతోపాటు నాగార్జున తల్లిదండ్రులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao), అన్నపూర్ణమ్మ(Annapoornamma )పేర్లు, అలాగే దగ్గుబాటి లక్ష్మి తల్లిదండ్రులు దగ్గుబాటి రామానాయుడు( Daggubati Ramanaidu), రాజేశ్వరి(Rajeswari )దంపతుల పేర్లు కూడా వెడ్డింగ్ కార్డ్ లో ముద్రించారు.
ఫేక్ అంటూ కొట్టి పారేసిన నెటిజన్స్..
అయితే అంతా బాగున్నా..ఈ ఇన్విటేషన్లో ముహూర్తం సమయం లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి వివాహానికి భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడి వివాహం జరిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ వెన్యూ కూడా వెడ్డింగ్ కార్డులో లేకపోవడంతో కూడా ఇది ఫేక్ వెడ్డింగ్ కార్డు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వెడ్డింగ్ కార్డు పై అక్కినేని కుటుంబం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.