Nindu Noorella Saavasam Serial Today Episode : గుడిలో ఉన్న మనోహరి తాను తీసుకొచ్చిన నూనెతో దీపాలు వెలిగించమని మిస్సమ్మకు చెప్తుంది. ఎందుకు ఆ నూనెతోనే దీపాలు వెలిగించమని చెప్తున్నావు మనోహరి. అంటూ మిస్సమ్మ అనుమానంగా అడుగుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇది అసలు విషయం పసిగట్టేలా ఉందని సైలెంట్ గా ఉండిపోతుంది. మైకులో పంతులు పౌర్ణమి సందర్భంగా గుడిలో డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు పాల్గొనవచ్చని చెప్తాడు. భూమి హ్యాపీగా నేను పాల్గొంటానని చెప్తుంది. అమ్ము కూడా నేనూ పాల్గొంటాను అంటుంది. అందరూ కలిసి డాన్స్ జరిగే దగ్గరకు వెళ్తారు.
అమ్ము వెళ్లి డాన్స్ చేస్తుంది. దూరం నుంచి చూస్తున్న ఆరు సంతోషిస్తుంది. అమ్ము చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా గుప్త గారు అంటుంది. తర్వాత భూమి వెళ్లి డాన్స్ చేస్తుంది. భూమి డాన్స్ చూస్తున్న శోభా చంద్ర కూడా హ్యాపీగా ఫీలవుతుంది. భూమితో కలిసి డాన్స్ చేసినట్టు కలగంటుంది. అది కలని తెలుసుకుని కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో గుప్త వచ్చి బాలిక నువ్వు తిరిగి వెళ్లు సమయం ఆసన్నమైంది అని చెప్తాడు. గుప్త మాటల వినగానే శోభ కృతజ్ఞతగా ఆరును చూస్తూ.. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు.
నీ పుణ్యాన్ని నా కడుపు కోత తీర్చడానికి వాడావు. కన్న కూతురుని కళ్లారా చూడలేకపోయాననే బాధను నువ్వు తీర్చావు. నువ్వు ఎవరో..? నాకే ఎందుకు ఈ సాయం చేశావో నాకు తెలియదు. నా వరకు నేను చూడని దైవం నువ్వు. నేను నమ్మిన ధర్మం నువ్వు. ఈ రుణ బంధం తీర్చుకోవాలని లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే నీయంత మంచి బుద్ది ఇవ్వమని ఆ దేవుడిని అడుగుతాను. మళ్లీ చచ్చేవరకు నీలాగే బతుకుతాను అంటూ ఎమోషనల్ అవుతుంది. ఆరు కూడా గర్వంగా ఫీలవుతుంది.
ఇంతో గుప్త బాలిక ఆఖరి సారి నీ కూమార్తెను చూసుకోవాలని ఉంటే చూసుకొనుము అని చెప్తాడు. దీంతో అవసరం లేదు గుప్త గారు నా కూతురి చుట్టూ ఇంత మంచి వాళ్లు ఉండగా నా కూతురుకు ఏమీ కాదు. సంతోషంగా ఉంటుంది. నేను వెళ్లి వస్తాను అరుంధతి అని చెప్తూ.. గుప్త గారు పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవ దేవుడిని దర్శించుకుని వెళ్తాను అని చెప్పి గుడిలోకి వెళ్తుంది శోభాచంద్ర ఆత్మ. మనం ఇక మిస్సమ్మ వాళ్ల దగ్గరకు వెళ్దాం పదండి గుప్పగారు అంటూ ఆరు వెళ్తుంది.
అపూర్వ, మనోహరికి ఫోన్ చేస్తుంది. ఇంకా ఏం జరగలేదా..? అసలు ఏమైందని అడుగుతుంది. ఇంకొద్దిసేపట్లో నీ శత్రువు. నా శత్రువు చనిపోబోతున్నారు. వాళ్లు వాడాల్సిన దీపపు నూనెను నేను మార్చేశాను. ఇప్పుడు వాళ్లు నేనిచ్చిన నూనెతో దీపం వెలిగించగానే అంతా మంటలో కాలి చనిపోతారు. వాళ్ల చావు నువ్వు చూడాలి కదా..? అందుకు నేను నీకు వీడియో కాల్ చేస్తాను. లైవ్ లో దాని చావును చూసి ఎంజాయ్ చేయ అని చెప్పి ఫోన్ కట్ చేసి వీడియో కాల్ చేసి అపూర్వకు లైవ్ చూపిస్తుంది మనోహరి.
మనోహరి ఫోన్ లో వీడియో కాల్ చూపిస్తుండటం చూసిన ఆరు అనుమానంగా గుప్తను అడుగుతుంది. ఇందాకటి నుంచి మనోహరి ఆఫోన్ పట్టుకుని ఏదో చేస్తుంది. దాని వరుస చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మౌనంగా ఉన్నారేంటి గుప్త గారు మను ఏమైనా ప్లాన్ చేసిందా..? అని అడుగుతుంది. అవునని మనోహరి భూమి, మిస్సమ్మలకు ప్రమాదం తలపెట్టిందని చెప్తాడు. ఆరు భయంతో మిస్సమ్మ అని పిలుస్తుంది. ఆరు మాటలు మిస్సమ్మకు వినిపించవు. ఇంతలో గుప్త బాలిక ఆగుము. నువ్వు ఎంత ప్రయత్నించినను. నీ మాటలు ఆ బాలికకు వినిపించవు.. నువ్వు ఆ బాలికకు కనిపించవు.. అని చెప్పగానే ఆరు షాక్ అవుతుంది.
భయంతో చూస్తుండిపోతుంది. మరోవైపు దీపం వెలిగించడానికి భూమి ప్రయత్నిస్తుంటే అగ్గిపుల్ల ఆరిపోతుంది. అలా రెండు మూడు సార్లు చేశాక మిస్సమ్మ తీసుకుని అగ్గిపుల్ల గీయగానే భూమి చేతిలోని దీపం మాయం అయిపోతుంది. ఎంటిలా జరిగింది అని అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఆరు, గుప్త మాత్రం శోభాచంద్ర వచ్చి దీపం తీసుకుపోవడం చూస్తారు. ఆరు ఊపిరి పీల్చుకుంటుంది. వీడియో కాల్ లో లైవ్ చూస్తున్న అపూర్వకు వీడియోలో శోభాచంద్ర కోపంగా కనిపిస్తుంది. దీంతో అపూర్వ భయంతో వణికిపోతుంది. భూమి, మిస్సమ్మ బాధపడుతుంటారు.
ఇంతలో భూమికి కూడా గుడి గోపురం మీద శోభాచంద్ర కనిపిస్తుంది. తనను దీవించినట్టు అనిపిస్తుంది. ఇంతలో శారద మరో దీపం ఉంది కదా అది వెలిగించండి అని చెప్తుంది. దీంతో భూమి మరో దీపం తీసుకోగానే అందులోకి పరమశివుడి నుంచి ఒక శక్తి వచ్చి ప్రవేశిస్తుంది. దీపం వెలిగించినా ఏమీ కాదు. అందరూ హ్యాపీగా దీపాలు వెలిగించి కోనేరులో వదులుతారు.
సీన్ కట్ చేస్తే.. అమర్, మిస్సమ్మ వాళ్ల ఇంటి బయట నిల్చుని ఉంటాడు. అమ్ము బయలకు వచ్చి అమర్‌ను లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్లిన అమర్ రామ్మూర్తిని మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను అని అడుగుతాడు. తీసుకెళ్లమని ఆడపిల్లకు పెళ్లాయ్యక పుట్టినిల్లు కేవలం చుట్టాల ఇంటి లాంటిదని మెట్టినిల్లే తనకు శాశ్వతం అని చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.