Naga Chaitanya Thandel:అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్లో తాజాగా వస్తున్న సినిమా తండేల్. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిన్న వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీకాకుళం యాసలో సాయి పల్లవి, నాగచైతన్య అదరగొట్టేశారు. ఇకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ.. తాను వైజాగ్ అల్లుడిని అంటూ తన ప్రేమ సంగతులు పంచుకున్నారు. అంతేకాదు వైజాగ్ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను అని ప్రమోషన్స్ కోసం తన పెళ్లిని కూడా వాడుకున్నాడు నాగచైతన్య.
సినిమా ప్రమోషన్స్ కోసం పెళ్లిని వాడుకుంటున్న చైతూ..
నాగచైతన్య మాట్లాడుతూ.. “నేను ఈ వైజాగ్ అల్లుడిని, వైజాగ్ అంటే ఎంత ప్రేమో, మళ్లీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మీ వైజాగ్ అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే నాకు వైజాగ్ తో అనుబంధం మరింత పెరిగిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. ఆ వైజాగ్ అమ్మాయిదే రూలింగ్ పార్టీ” అంటూ ఫన్నీగా స్పీచ్ ఇచ్చాడు నాగచైతన్య. మొత్తానికైతే శోభిత ధూళిపాళ్లను, అలాగే వైజాగ్ ను తన సినిమా ప్రమోషన్స్ కోసం గట్టిగా వాడేసుకున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భార్య వైజాగ్ కావడం వల్లే కనీసం తన భార్య కారణంగా అయినా తన సినిమా చూడాలని అన్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
వైజాగ్ పై నాగచైతన్య కామెంట్స్..
అలాగే వైజాగ్ గురించి మాట్లాడుతూ.. “ఏ సినిమా రిలీజ్ అయినా సరే వైజాగ్ టాక్ ఏంటి? అనేది మాత్రమే కనుక్కుంటాము. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆ సినిమా ఆడాల్సిందే. ముఖ్యంగా నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదే. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. తండేల్ సినిమాకు వైజాగ్ లో కలెక్షన్స్ అన్నీ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో మన పరువు పోతుంది ” అంటూ నాగచైతన్య నవ్వుతూ కామెంట్లు చేశారు.
అల్లు అరవింద్ పై ప్రశంసలు..
అలాగే తండేల్ సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ (Allu Aravindh) గురించి కూడా నాగచైతన్య గొప్పగా తెలిపారు. పుష్ప కా బాప్ అంటూ అల్లు అరవింద్ కు ఎలివేషన్ ఇచ్చాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి తన లైఫ్ లో నిజమైన తండేల్ అరవింద్ అని, చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా తాను ఎలా చేయగలను అనే ఫీలింగ్ కూడా వచ్చేసిందని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఉందని, ఆయన గైడెన్స్ చాలా విలువైనదని, ఆయనకు తాను జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కూడా తెలిపారు నాగచైతన్య. ఇక ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు నాగచైతన్య చేసిన కామెంట్లు చూసి బాసూ మీరు కూడా మారిపోయారు. అందరిలాగే ప్రాంతీయతను వాడుకుంటూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.