February Movies : ప్రతి ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో తెలిసిందే. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని స్టార్ హీరోల సినిమాలు పోటీ పడతాయి. ఇక ఫిబ్రవరి నెలకొచ్చేలోగా ఏవో రొమాంటిక్ సినిమాలో లేకుంటే లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మాత్రమే విడుదల అవుతాయి. కానీ ఏడాది మాత్రం ఫిబ్రవరి నెలలో బాగా టఫ్ ఫైట్ జరగనుంది. జనవరిలో రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ అయిన సినిమాలు దాదాపు ఫిబ్రవరి నెలలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు?ఫిబ్రవరి నెలలో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
తండేల్..
అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్ ‘.. భారీ అంచనాల మధ్య దిగుతోంది. బడ్జెట్, క్యాస్టింగ్, బ్యాక్ డ్రాప్ పరంగా చూసుకుంటే ఏ ప్యాన్ ఇండియా మూవీకి తీసిపోని రీతిలో మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక సినిమాపై ఆసక్తి రెట్టింపు అయింది. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
లైలా..
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కదా విశ్వక్ సేన్ విభిన్న కథలతో కొత్త సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు.. గత ఏడాది వచ్చిన సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈయన చివరగా నటించిన సినిమా గ్యాంగ్ ఆఫ్ గోదావరి. కంప్లీట్ మాస్ లుక్ లో విశ్వక్ అదరగొట్టాడు.. ఇప్పటివరకు అబ్బాయి లాగా మాస్ లుక్ లో క్లాస్ లుక్ లో అదరగొట్టిన విశ్వక్ ఇప్పుడు అమ్మాయిగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈ మూవీ వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఆకాంక్ష శర్మ కథానాయిక. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
దిల్ రుబా..
క సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 10వ సినిమాగా తెరకెక్కుతుంది. రుక్సార్ ధిల్లాన్, ఖ్యాతి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, యూడ్లీ ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. మూవీ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ కాబోతుంది..
మజాకా..
తెలుగు హీరో సందీప్ కిషన్ విభిన్న కథాచిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న భైరవకోన మంచి టాక్ ని సొంతం చేసుకుంది. దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబోలో ఫిబ్రవరి 21న వస్తున్న మజాకా మీద బజ్ పెరుగుతోంది. టీజర్ లో హామీ అయితే దొరికింది..
వీటితో పాటు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ, అటు తమిళ్లోనూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ తమిళంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ రిలీజవుతోంది. దీంతో పాటు ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విక్కీ కౌశల్, రష్మిక మందన్న ‘చావా’ని తక్కువంచనా వేయడానికి లేదు.. ఇక వీటితోపాటు డేట్స్అనౌన్స్ అయిన సినిమాలు కూడా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది మరి ఏ సినిమా ఏ డేట్ ను ఆఫ్ చేసుకుంటుందో చూడాలి.. ఏది ఏమైనా ఈ ఫిబ్రవరి నెల పోటీ గట్టిగానే ఉందని చెప్పాలి..