BigTV English

Sara Tendulkar: కొత్త జీవితంలోకి మొదలు పెట్టిన సారా..ఇక గిల్ కు సన్యాసమేనా ?

Sara Tendulkar: కొత్త జీవితంలోకి మొదలు పెట్టిన సారా..ఇక గిల్ కు సన్యాసమేనా ?

Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ భారీ అభిమానులను సంపాదించుకుంది. తన లైఫ్ స్టైల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సారా టెండూల్కర్ కి ఇంస్టాగ్రామ్ లో 7.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అంటే ఆమె ఎంత పెద్ద సెలబ్రిటీ అనేది ఊహించుకోవచ్చు.


Also Read: Dhruv Jurel – Gambhir: కొంచెమైనా బుర్రుందా గంభీర్‌…జురేల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పై ట్రోలింగ్‌ ?

సారా ముంబైలోని ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది. అనంతరం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడి లండన్ యూనివర్సిటీ కాలేజీలో వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సారా టెండుల్కర్ తల్లి అంజలి కూడా వైద్యురాలే. దీంతో సారా కూడా తల్లి బాటలోనే వైద్యవృత్తిని ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. సారా టెండూల్కర్ కి, భారత యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కి మధ్య రిలేషన్ ఉన్నట్లు ఆ మధ్య రూమర్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.


వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లు అలాగే పార్టీలకు వెళ్లినట్లు గతంలో ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో సారా అలాగే గిల్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారాలు కూడా జరిగాయి. కానీ కొంతకాలం తర్వాత ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. అయితే ప్రస్తుతం సార్ అటెండూల్కర్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ కి కొత్త డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది సారా.

తండ్రి సచిన్ టెండుల్కర్ తనకు ఇచ్చిన సరికొత్త బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని సారా తహతహలాడుతోంది. నిరుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో స్థాపించిన సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ ఇటీవల ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంబే క్లబ్ లో ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 5వ వార్షికోత్సవ వేడుకలలోనే సారా టెండుల్కర్ నీ ఫౌండేషన్ డైరెక్టర్ గా ప్రకటించారు.

తనకి చాలా పెద్ద బాధ్యత రావడంతో సారా కూడా ఆనందంగా స్వీకరించింది. తనకి ఈ బాధ్యతలను అప్పగించడం పట్ల సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఈ సంస్థ గత ఐదేళ్లలో దాదాపు లక్ష మంది పిల్లల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకువచ్చింది.

Also Read: Rohit Sharma: అమ్మ***నా బూతులు తిడుతున్నాడు.. గవాస్కర్ పై BCCI కి రోహిత్ శర్మ ఫిర్యాదు?

అయితే సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ భవిష్యత్తులో ఎంతోమంది నిరుపేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలని, చిన్నారుల కళలను సహకారం చేయడంలో అంకితభావంతో ముందుకు సాగుతానని తెలిపింది సారా. దీంతో సచిన్ టెండుల్కర్ జీవితంలో క్రీడారంగంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన విధంగా.. సారా టెండుల్కర్ కూడా ఈ ఫౌండేషన్ ని ముందుకు నడిపించి, సమాజానికి మరింత సేవ చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×