Jasprit Bumrah: వన్డే క్రికెట్ లో అతిపెద్ద టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి సమయం దగ్గర పడింది. ఈ టోర్నమెంట్ కి ఇంకా 36 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 వ తేదీ నుండి ప్రారంభం కానుండగా.. ఈ టోర్నికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కేవలం భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
Also Read: Akaay Kohli: విరుష్క దంపతుల పిల్లల ఫోటోలు వైరల్.. ఎలా ఉన్నారో చూడండి!
అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరోగ్య కారణాలతో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీలోని గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బుమ్రా.. పునరావాసం కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కి వెళ్ళాలని బీసీసీఐ అతడిని కోరినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తిస్థాయిలో సిద్ధం అయ్యేందుకు బుమ్రా ఎన్సీఏ కి వెళ్ళాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
ప్రాథమిక నివేదికలో బుమ్రాకి ఫ్రాక్చర్ కాలేదు కానీ.. అతడి వెన్ను భాగంలో వాపు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఎన్సీఏ పర్యవేక్షణలో అతడు త్వరగానే కోలుకుంటాడని.. పూర్తిస్థాయిలో కోలుకున్న తరువాతే ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందని తెలిపారు. అయితే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ ని మార్చ్ 2 న ఆడబోతోంది. ఇక మార్చ్ 4, 5 తేదీలలో సెమీఫైనల్స్ జరగనుండగా.. మార్చ్ 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
భారత జట్టు గ్రూప్ స్టేజ్ లో రాణించి. నాకౌట్ దాకా వెళితే.. ఆ సమయంలో బుమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే దుబాయ్ నుండి బ్యాగులు సర్దుకోవాల్సిందే. గాయంతో బాధపడుతున్న బుమ్రా పేరు 15 మందితో కూడిన జట్టులో ఉంచాలా..? లేక రిజర్వ్ ఆటగాళ్లలో ఉంచాలా..? అన్న విషయాన్ని సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత ప్రాతిపాదిత జట్టును బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది.
Also Read: New Zealand Squad: ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే..కేన్ మామ వచ్చేశాడు!
ఫిబ్రవరి 12వ తేదీ వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు సమయం ఉండడంతో బుమ్రా పరిస్థితిని పర్యవేక్షించి అతడికి అవకాశం కల్పించే వీలుంది. మార్చ్ మొదటి వారంలోనే బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని బిసిసిఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే జట్టును ప్రకటించే విషయంలో మరింత సమయం కావాలని ఐసీసీని రిక్వెస్ట్ చేసిందట బీసీసీఐ. ఒకవేళ బుమ్రా జట్టులో లేకుండా టోర్నీకి దూరమైతే అతడి స్థానంలో ఏ ఆటగాడిని తీసుకుంటారో..? వేచి చూడాలి.
🚨 NO BUMRAH FOR INDIA IN CT. 🚨
– Jasprit Bumrah likely to miss the group stages of the 2025 Champions Trophy due to back swelling. (Express Sports). pic.twitter.com/anVmanCp4a
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025