BigTV English

Naga Vamsi : క్లూ ఇచ్చాడా..? హైప్ ఇచ్చాడా..?

Naga Vamsi : క్లూ ఇచ్చాడా..? హైప్ ఇచ్చాడా..?

Naga Vamsi : పుష్ప 2 తర్వాత బన్నీ మూవీ త్రివిక్రమ్‌తో కాదు.. అట్లీతోనే అని దాదాపు కన్ఫర్మ్ అయింది. స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి బన్నీ – అట్లీ ఇప్పటికే దుబాయ్ కి వెళ్లారు. మూవీ కూడా త్వరలోనే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఏంటో… కథేంటో… అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.


కానీ, బన్నీ – అట్లీ మూవీ తర్వాత బన్నీ – త్రివిక్రమ్ మూవీ ఉండబోతుంది ఇది కూడా కన్ఫర్మ్. ప్రస్తుతం ఈ మూవీ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ మూవీ స్టోరీ గురించి చర్చ జరుగుతుంది. ఈ మూవీలో ఉండే స్టార్స్ గురించి నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇంత హైప్ రావడానికి కారణం… ఇటీవల ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశీ చేసిన కామెంట్సే అని చెప్పొచ్చు.

నాగ వంశీ… తన బ్యానర్‌లో వచ్చే ప్రతి సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటాడు. ఆయన చేసే కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతాయి. ప్రస్తుతం ఆయన బ్యానర్ నుంచి మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ రాబోతుంది. ఈ నెల 28న ఆ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బన్నీ – త్రివిక్రమ్ మూవీపై నాగ వంశీ మాట్లాడాడు.


నిజానికి ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పలేదు ఆయన. చాలా కాలం నుంచి ఈ మూవీపై వస్తున్న మాటలనే ఆయన నోటి నుంచి వచ్చాయి అంతే. బన్నీ – త్రివిక్రమ్ మూవీ కథపై ఓ క్లారిటీ ఇచ్చాడు… కథ ఏం చెప్పలేదు.

ఆ మూవీ మైథాలాజికల్ నేపథ్యంలో ఉంటుందని చెప్పాడు. అయితే… అందరూ చేస్తున్నట్టు రామాయణం, మహా భారతం కాకుండా.. అందరికీ తెలిసిన దేవుడి గురించి, ఎవరికీ తెలియని విషయాలతో కథ రూపొందించినట్టు, ఆ కథతోనే వస్తున్నామని ఓ క్లారిటీ ఇచ్చాడు అంతే. కథ గురించి అసలేం చెప్పలేదు. ఆ దేవుడు ఎవరో కూడా చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే… అసలు ఏ ఒక్క విషయం చెప్పలేదు ఆ మూవీకి సంబంధించి.

కానీ, ఆయన ఇచ్చిన ఓ చిన్న క్లారిటీతోనే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అల్లు అర్జున్‌ను దేవుడిగా మార్చి… ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు ఆయన ఫ్యాన్స్. బన్నీ – త్రివిక్రమ్ మూవీ ఈ దేవుడి గురించే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. అసలేం మాట్లాడకుండా… ఓ చిన్న క్లారిటీ ఇస్తేనే ఇంత హైప్ క్రియేట్ అయితే… సినిమా వస్తే ఎలా ఉంటుందో.. అని క్రిటిక్స్ కూడా అంటున్నారు.

నిజానికి ఇప్పుడు బన్నీ చేయబోయే మూవీ అట్లీతో… ఉంటే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరగాలి. ఎందుకంటే.. అట్లీ ఏం చిన్న డైరెక్టర్ కాదు. పాతాళానికి పడిపోయిన బాలీవుడ్‌కు 1100 కోట్ల మూవీ ఇచ్చాడు. విజయ్ దళపతికి ఓ 300 కోట్లు, ఓ 200 కోట్లు, ఓ 150 కోట్ల సినిమాలను ఇచ్చాడు.

జవాన్ తర్వాత అట్లీ… పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ ఇండియా మొత్తం పాకిపోయింది. ఇలాంటి కాంబో సెట్ అయితే… ఎంతటి హై ఉంటుంది. కానీ, అలాంటిదేమీ కనిపించడం లేదు.

త్రివిక్రమ్ కోసం ఇలా చెప్పుకోవడానికి రికార్డులు పెద్దగా ఏం లేవు. పైగా సీన్స్ అన్నీ కాపీ కొడుతాడు అనే ఓ అపవాదు కూడా ఉంది ఈయనపైన. అయినా… అట్లీ మూవీ గురించి కాకుండా… త్రివిక్రమ్ మూవీ గురించే ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీనికి కారణం… నాగ వంశీ ఇచ్చిన ఆ చిన్న క్లారిటీనే. అది క్లారిటీ లా లేదు… ఆ మూవీకి ఇప్పటి నుంచి ఇస్తున్న హైప్‌లా ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×