Shashank Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్ పై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.
Also Read: Olympics 2032: నేలమట్టం కానున్న గబ్బా స్టేడియం… కారణం ఇదే
పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ {97*} తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. చివరిలో శశాంక్ సింగ్ {44*} మెరుపు బ్యాటింగ్ చేశాడు. 19 ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి 97 పరుగులకు చేరుకున్న శ్రేయస్ అయ్యర్ కి.. చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆఖరి ఓవర్ లో స్ట్రైకింగ్ లో ఉన్న శశాంక్ ఏకంగా ఐదు ఫోర్లు కొట్టాడు. దీంతో పంజాబ్ 243 పరుగులు చేసింది.
అనంతరం 254 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన గుజరాత్ జట్టుకు మెరుపు ఆరంభం లభించింది. గిల్, సాయి సుదర్శన్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో గుజరాత్ జట్టు గెలిచే విధంగా కనిపించింది. కానీ దూకుడుగా ఆడుతున్న సాయి సుదర్శన్ ని అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తరువాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విజయ్ కుమార్ వైశాక్ అద్భుతమైన బంతులతో గుజరాత్ జట్టు పరుగులను కట్టడి చేశాడు.
ఇక గుజరాత్ జట్టు విజయానికి చివరి ఓవర్లో 27 పరుగులు కావలసి ఉండగా.. తొలి బంతికే రాహుల్ తెవాటియా అవుట్ అయ్యాడు. అనంతరం రూథర్ ఫోర్డ్ పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతికి షారుక్ ఖాన్ సిక్స్ కొట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే శశాంక్ సింగ్ స్ట్రైక్ ఇవ్వకపోవడంతో సెంచరీ చేయలేకపోయాడు శ్రేయస్ అయ్యర్. ఈ నేపథ్యంలో పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడిన శశాంక్ సింగ్.. శ్రేయస్ అయ్యర్ సెంచరీకి సహకరించకపోవడానికి గల కారణాన్ని తెలిపాడు.
Also Read: Rishabh Pant: రూ. 27 కోట్లు తీసుకుని ఒక్క స్టంప్ చేయలేదు.. పంత్ పై ట్రోలింగ్ !
” నా సెంచరీ గురించి ఆలోచించకు అని శ్రేయస్ అయ్యర్ నాతో చెప్పాడు. సెంచరీ గురించి కాకుండా స్వేచ్ఛగా షార్ట్స్ ఆడాలని సూచించాడు. ఈ కారణంగానే నేను అయ్యర్ కి స్ట్రైక్ ఇవ్వలేదు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అద్భుతం. అతడి బ్యాటింగ్ చూడముచ్చటగా అనిపించింది. నాకు తొలి బంతి నుంచే హిట్ చేయాలని సూచించాడు. దాంతో నేను బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాను. ఎటువంటి షార్ట్స్ కొట్టాలనేది నాకు తెలుసు. నా బలాలకు తగ్గట్లుగానే నేను షాట్స్ ఆడతాను” అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ ని అభిమానులు పొగుడుతున్నారు.